రూట్ మొబైల్ బంపర్ లిస్టింగ్

గురువారం రూట్ మొబైల్ భారీ ప్రీమియంతో లిస్టైంది. 103శాతం పైగా ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.708 వద్ద, ఎన్‌ఎస్‌ఈల్లో రూ.717 వద్ద ఈ స్టాక్ గురువారం ప్రస్థానాన్ని ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి 3 నిమిషాల్లోనూ కోటికి పైగా షేర్లు చేతులు మారాయి. ఇంట్రాడేలో రూట్ మొబైల్ రూ.735కు చేరి డే గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 99 శాతం పైగా లాభంతో రూ.697 వద్ద షేర్ ట్రేడవుతోంది.
రూ.600 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన రూట్ మొబైల్ తొలిరోజే ఇన్వెస్టర్లకు కాసులపంట పండించింది. ఇష్యూ ధర రూ.350 కాగా ఈ ఇష్యూ 73.30 రెట్ల ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ స్టాక్ రూ.580-600 మధ్య లిస్ట్ కావచ్చని ఎనలిస్టులు అంచనా వేసినప్పటికీ.. వారి అంచనాలను మించుతూ రూ.708 వద్ద రూట్‌మొబైల్ స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com