Smart Tips : దీపావళికి కొత్త కారు కొనండి.. ఈ సింపుల్ టిప్ప్ పాటించి రూ.వేల ఆదా చేస్కోండి.

Smart Tips : దీపావళికి కొత్త కారు కొనండి.. ఈ సింపుల్ టిప్ప్ పాటించి రూ.వేల ఆదా చేస్కోండి.
X

Smart Tips : భారతీయ సంస్కృతిలో దీపావళి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, కొత్త వస్తువులు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల కంపెనీలు బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తాయి. మీరు కూడా ఈ దివాలీకి కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, కొన్ని తెలివైన చిట్కాలు పాటించి వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.

1. పండుగ ఆఫర్లను పూర్తిగా వాడుకోండి

దీపావళి సీజన్‌లో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ ఆఫర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, వీలైనంత ఎక్కువ లబ్ధి పొందాలి. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ అలాగే కొన్ని బ్రాండ్లు ఉచిత యాక్సెసరీస్ ప్యాకేజీలు లేదా ఫ్రీ సర్వీస్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. ఈ అన్ని ఆఫర్లను కలిపితే రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు ఆదా చేయవచ్చు.

2. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ధరలను సరిపోల్చండి

కేవలం డీలర్‌షిప్‌లకే పరిమితం కాకుండా, వివిధ ఆన్‌లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా కార్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. ఆన్‌లైన్‌లో ధరలు, డీలర్‌షిప్ ధరల కంటే కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి కారు కొనడానికి ముందు రెండు చోట్లా ధరలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

3. పాత కారుకు సరైన ఎక్స్ఛేంజ్ ధర పొందండి

మీ దగ్గర పాత కారు ఉంటే, దాన్ని ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇవ్వడం ద్వారా మంచి ధర పొందవచ్చు. దీపావళి సీజన్‌లో, సాధారణ రోజుల కంటే ఎక్కువ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కంపెనీలు ఇస్తాయి. దీని వల్ల పాత కారుకు మంచి విలువ లభిస్తుంది.

4. లోన్, ఫైనాన్సింగ్ వైపు దృష్టి పెట్టండి

కారు కొనుగోలు కోసం ఎక్కువ మంది ఆటో లోన్ తీసుకుంటారు. పండుగ సందర్భంగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందిస్తాయి. జీరో ప్రాసెసింగ్ ఫీజు లేదా నో-EMI పీరియడ్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. వివిధ బ్యాంకుల ఆఫర్లను పోల్చడం ద్వారా, సుదీర్ఘ కాలంలో మీరు వడ్డీపై వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

5. డీలర్‌తో చర్చలు జరపడం మర్చిపోవద్దు

కంపెనీ పండుగ ఆఫర్‌లు ఫిక్స్ అయినా, డీలర్‌తో మాట్లాడి మీరు మరింత తగ్గింపు పొందవచ్చు. మీరు ఉచిత కార్ యాక్సెసరీస్, ఫ్రీ ఇన్సూరెన్స్ లేదా అదనపు సర్వీసింగ్ ఆఫర్లు అడగవచ్చు. సరైన చర్చలు జరిపితే, నిర్ణీత ఆఫర్‌లతో పాటు అదనంగా డబ్బు ఆదా అవుతుంది.

6. సంవత్సరం చివరి స్టాక్ క్లియరెన్స్‌ను వాడుకోండి

దీపావళి తర్వాత సంవత్సరం ముగింపునకు వస్తుంది, ఈ సమయంలో డీలర్‌షిప్‌లు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి చూస్తాయి. కొనే కారు 2024 మోడల్ అయితే, దానిపై భారీ డిస్కౌంట్‌లు లభించే అవకాశం ఉంటుంది. మోడల్ కొత్తదే అయినా, తయారీ సంవత్సరం పాతది కాబట్టి ధరలో పెద్ద తేడా వస్తుంది.

7. సరైన సమయానికి బుకింగ్ చేయండి

దీపావళికి ముందుగానే ముందస్తు బుకింగ్ చేసుకుంటే మంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంది. చాలా కంపెనీలు తొలి కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ఇస్తాయి. సరైన సమయంలో బుక్ చేసుకుంటే, కారు డెలివరీ కూడా త్వరగా లభిస్తుంది. ధర విషయంలోనూ లబ్ధి పొందవచ్చు.

Tags

Next Story