BYD Emax : బీవైడీ నుంచి ఈమ్యాక్స్7 ఈవీ ఎలక్ట్రిక్ కారు

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థ బీవైడీ ఇండియా దేశీయంగా మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన బీవైడీ ఈ6కి కొనసాగింపుగా ఈమ్యాక్స్ 7 ఎంపీవీని లాంచ్ చేసింది. దీని ధర రూ.26.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.29.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం, సుపీరియర్ వేరియంట్లలో లభిస్తుంది. రెండు వేరియంట్లలోనూ 6, 7 సీట్ల ఆప్షన్‌ను అందిస్తోంది.
సింగిల్ ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు
ప్రీమియం వేరియంట్‌లో 55.4 కిలో వాట్‌అవర్ బ్యాటరీని అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌తో 420 కిలోమీటర్లు దూరం వెళుతుంది. సుపీరియర్ వేరియంట్ 71.8 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రీమియం వేరియంట్ 163 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. రెండు మోడళ్ల టాప్ స్పీడ్ 180 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది.
ఫీచర్ల విషయానికొస్తే
క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఇచ్చారు. 12.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఉంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎన్‌ఎఫ్‌సీ కార్డ్ కీ ఇచ్చారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఈమ్యాక్స్ 7 సుపీరియర్ వేరియంట్‌లో లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఇచ్చారు. బ్యాటరీపై 8 ఏళ్లు/ 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బీవైడీ స్టాండర్డ్ వారెంటీ ఇస్తోంది. మోటార్‌పై 8 ఏళ్లు/ 5 లక్షల కిలోమీటర్ల వారెంటీ అందిస్తోంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com