BYD Sealion 7 Price Hike: ఒక్క ఛార్జ్‌తో 567 కిలోమీటర్ల ప్రయాణం..50 వేలు పెరిగిన సూపర్ ఎలక్ట్రిక్ కారు ధర.

BYD Sealion 7 Price Hike: భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనా దిగ్గజం BYD, తన పాపులర్ ఎస్‌యూవీ సీలయన్ 7 ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2026 నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 567 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ కారు ధర పెరగడం ఈవీ ప్రియులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినా, కంపెనీ మాత్రం మెరుగైన టెక్నాలజీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
బివైడి ఇండియా ప్రకటించిన వివరాల ప్రకారం.. సీలయన్ 7 లోని ప్రీమియం వేరియంట్ ధరను మాత్రమే రూ.50,000 మేర పెంచారు. అయితే, పర్ఫార్మెన్స్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈ పెరిగిన ధరలు కొత్తగా బుక్ చేసుకునే వారికే వర్తిస్తాయి. డిసెంబర్ 31, 2025 లోపు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రం పాత ధరలకే కారును డెలివరీ చేస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అంటే ఆ సమయంలో బుక్ చేసుకున్న వారు అదృష్టవంతులనే చెప్పాలి.
కార్లలో సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, కస్టమర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసమే ఈ ధరల పెంపు అని బివైడి స్పష్టం చేసింది. సీలయన్ 7 లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2,300 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణకు ఇది ఒక నిదర్శనం అని బివైడి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు.
బివైడి సీలయన్ 7 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 82.56 kWh బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సెల్-టు-బాడీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. సేఫ్టీ పరంగా దీనికి యూరో NCAP 5-స్టార్ రేటింగ్ ఉంది. కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 567 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ కారు ధర రూ.48.90 లక్షల నుంచి ప్రారంభమై రూ.54.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ధర పెరిగినప్పటికీ, సీలయన్ 7 అందించే రేంజ్, లగ్జరీ ఫీచర్లు ఇతర బ్రాండ్లతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి. 10-ఇంచ్ టచ్ స్క్రీన్, అదిరిపోయే ఇంటీరియర్, వైర్‌లెస్ ఛార్జింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీరు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, ధర పెరిగినా కూడా సీలయన్ 7 ఇప్పటికీ సెగ్మెంట్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

