Children Fund: చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్.. నెలకు రూ.10 వేలతో రూ.2.2 కోట్ల రిటర్న్.

Children Fund: చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్.. నెలకు రూ.10 వేలతో రూ.2.2 కోట్ల రిటర్న్.
X

Children Fund: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తాము కోల్పోయిన ప్రతి సదుపాయాన్ని ఇవ్వాలని కలలు కంటారు. ఈ కలను నిజం చేసుకోవాలంటే సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. పిల్లల పేరు మీద పిగ్గీ బ్యాంకులు పెట్టడం మంచి ప్రారంభమే అయినా, కొన్ని ప్రత్యేకమైన పథకాల ద్వారా మీరు వారి కోసం కోట్లాది రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. పిల్లల చదువు లేదా వివాహం వంటి పెద్ద లక్ష్యాల కోసం, వారు పుట్టినప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం చిల్డ్రన్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం అత్యంత తెలివైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రణాళిక ఏంటి, ఎలా పని చేస్తుంది, దాని లెక్కలేంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ రంగంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొన్ని ఫండ్స్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ప్రసిద్ధి చెందిన ICICI ప్రుడెన్షియల్ చిల్డ్రన్ ఫండ్. దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడి ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. ఇది పిల్లల కోసం ఒక బలమైన ఆర్థిక పునాదిని నిర్మించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక ఓపెన్-ఎండెడ్ పథకం. ఈ ఫండ్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో కనీసం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. లేదా మీ బిడ్డ మేజర్ (18 ఏళ్లు) అయ్యే వరకు ఈ లాక్-ఇన్ కొనసాగుతుంది.

మార్కెట్‌ను బట్టి మారే తెలివైన వ్యూహం

ఈ చిల్డ్రన్ ఫండ్ అతిపెద్ద బలం దాని అనుకూల పెట్టుబడి వ్యూహం. ఇది ఇతర ఫండ్స్ లాగా ఒకే సూత్రానికి కట్టుబడి ఉండదు, బదులుగా మార్కెట్ పరిస్థితులను బట్టి తన పెట్టుబడిని మారుస్తూ ఉంటుంది. మార్కెట్ స్థిరంగా, సురక్షితంగా ఉన్నప్పుడు తన పెట్టుబడిలో దాదాపు 35% వరకు డెట్సాధనాల్లో పెడుతుంది. మార్కెట్‌లో వృద్ధి సంకేతాలు కనిపించిన వెంటనే, ఫండ్ మేనేజర్లు ఆలస్యం చేయకుండా ఈక్విటీలో తమ వాటాను పెంచి, దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ ఫ్లెక్సిబుల్ విధానం వల్ల రెండు లాభాలు: మంచి అవకాశాలు ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు పోర్ట్‌ఫోలియోపై ప్రభావం తగ్గుతుంది.

ఫండ్ పనితీరు అద్భుతం (

ఈ ఫండ్ గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకవేళ ఎవరైనా 31 ఆగస్టు 2001న ఈ ICICI ప్రుడెన్షియల్ చిల్డ్రన్ ఫండ్‌లో రూ.10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లయితే అది 31 అక్టోబర్ 2025 నాటికి సుమారు రూ.3.3 కోట్లకు పెరిగేది. అంటే, ఇది 15.58% వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందింది. ఇది బెంచ్‌మార్క్ ఇండెక్స్ (13.46%) కంటే చాలా ఎక్కువ. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గణాంకాలు మరింత అద్భుతంగా ఉన్నాయి. మొదట్నుంచీ ప్రతి నెలా రూ.10,000 SIP చేసినట్లయితే, 31 అక్టోబర్ 2025 నాటికి మొత్తం పెట్టుబడి రూ.29 లక్షలు కాగా, దాని విలువ రూ.2.2 కోట్లకు పెరిగి ఒక భారీ ఫండ్‌గా మారేది.

Tags

Next Story