CHINA: డ్రాగన్ దందాకు భారత్ చెక్!

CHINA: డ్రాగన్ దందాకు భారత్ చెక్!
X
రేర్ ఎర్త్ సరఫరాలో 60-70% చైనాదే.. స్వయం స్వాలంబన దిశగా భారత్... మేకిన్ ఇండియా-గ్రీన్ ఇండియా లక్ష్యం

అమె­రి­కా-చైనా వా­ణి­జ్య సం­బం­ధాల మధ్య నె­ల­కొ­న్న అస్థి­రత.. ప్ర­పంచ సర­ఫ­రా గొ­లు­సు­ల­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తోం­ది. ము­ఖ్యం­గా ఆధు­నిక సాం­కే­తిక పరి­క­రా­లు, ఎల­క్ట్రి­క్ వా­హ­నా­లు, రక్షణ వ్య­వ­స్థ­లు, పు­న­రు­త్ప­త్తి శక్తి రం­గా­లు వంటి వి­భా­గా­ల్లో కీ­ల­కం­గా మా­రిన అరు­దైన భూమి మూ­ల­కా­లు ప్ర­పంచ ఆర్థిక వ్య­వ­స్థ­లో వ్యూ­హా­త్మక ప్రా­ధా­న్యత పొం­దా­యి. ఈ నే­ప­థ్యం­లో పొ­రు­గు దేశం చై­నా­పై గల అధిక ఆధా­రా­న్ని తగ్గిం­చు­కో­వ­డం ఇప్పు­డు అన్ని ప్ర­ధాన దే­శాల లక్ష్యం­గా మా­రిం­ది. ఈ నే­ప­థ్యం­లో భా­ర­త్ రేర్ ఎర్త్ మె­ట­ల్స్ మీద తీ­సు­కుం­టు­న్న కొ­త్త చర్య­లు, పె­ట్టు­బ­డు­లు, వి­ధాన మా­ర్పు­లు దేశ భద్ర­తా, ఆర్థిక, సాం­కే­తిక స్వా­వ­లం­బన వైపు కీ­ల­క­మైన అడు­గు­లు వే­స్తు­న్నా­యి. భా­ర­త్ ప్ర­స్తు­తం తన అరు­దైన భూమి అయ­స్కాం­తాల ని­ల్వ­ల­ను ని­ర్మిం­చు­కు­నే ది­శ­గా వే­గం­గా కదు­లు­తోం­ది. దే­శీయ ఉత్ప­త్తి­ని పెం­చి, ది­గు­మ­తుల మూ­లా­ల­ను వై­వి­ధ్య­ప­ర­చేం­దు­కు ప్ర­భు­త్వం సమ­గ్ర ప్ర­ణా­ళి­క­ను రూ­పొం­దిం­చిం­ది. ఇం­దు­లో భా­గం­గా అనేక రా­ష్ట్రా­ల్లో రేర్ ఎర్త్ మి­న­ర­ల్స్ తవ్వ­కా­ల­కు అను­మ­తు­లు ఇచ్చిం­ది కేం­ద్రం. కొ­త్త మై­నిం­గ్ లై­సె­న్సు­లు జారీ చే­య­డం ద్వా­రా ప్రై­వే­ట్, ప్ర­భు­త్వ రంగ సం­స్థ­ల­కు ఉత్సా­హం కల్పిం­చే ది­శ­గా అడు­గు­లు వే­సిం­ది. అదే­వి­ధం­గా రేర్ ఎర్త్ మా­గ్నె­ట్స్ ఉత్ప­త్తి ను ప్రో­త్స­హిం­చ­డా­ని­కి ప్ర­త్యేక ఆర్థిక ప్రో­త్సా­హ­కా­లు కూడా అం­ది­స్తు­న్నా­యి. దీని వల్ల భా­ర­త్‌­లో వి­లు­వైన భూ­లోహ పరి­శ్ర­మ­కు పె­ట్టు­బ­డు­లు రా­వ­డా­ని­కి అవ­కా­శా­లు పె­రు­గు­తు­న్నా­యి. ప్ర­స్తు­తం ప్ర­పం­చం­లో­ని రేర్ ఎర్త్ సర­ఫ­రా­లో సు­మా­రు 60 నుం­చి 70 శాతం వాటా చై­నా­కే ఉంది. ఈ ఆధా­రా­న్ని తగ్గిం­చు­కో­వా­లం­టే భా­ర­త­దే­శం ద్వై­పా­క్షిక, బహు­పా­క్షిక భా­గ­స్వా­మ్యాల ద్వా­రా ప్ర­త్యా­మ్నాయ మా­ర్గా­లు అన్వే­షి­స్తోం­ది.

జపా­న్, ఆస్ట్రే­లి­యా, అమె­రి­కా వంటి దే­శా­ల­తో కలి­సి క్రి­టి­క­ల్ మి­న­ర­ల్స్ పా­ర్ట్న­ర్షి­‌­ప్ ఏర్పా­టు చేసి, మై­నిం­గ్, ప్రా­సె­సిం­గ్ రం­గా­ల్లో సాం­కే­తిక సహ­కా­రం పెం­చు­తోం­ది. ఇక స్వ­ల్ప­కా­లిక ది­గు­మ­తి అం­త­రా­యా­ల­ను ఎదు­ర్కో­వ­డా­ని­కి అత్య­వ­సర ని­ధు­లు కే­టా­యిం­చిం­ది. తద్వా­రా సర­ఫ­రా గొ­లు­సు ని­రం­త­రా­యం­గా కొ­న­సా­గు­తుం­ది. అయ­స్కాం­తాల తయా­రీ­లో అరు­దైన భూమి మూ­ల­కా­ల­కు ప్ర­త్యా­మ్నా­యా­లు కను­గొ­నే ప్ర­య­త్నా­లు ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా జరు­గు­తు­న్నా­యి. భా­ర­త్ లో అనేక శా­స్త్రీయ సం­స్థ­లు రేర్ ఎర్త్ ఫ్రీ మా­గ్నె­ట్స్ అభి­వృ­ద్ధి ది­శ­గా పరి­శో­ధ­న­లు చే­స్తు­న్నా­రు. ఇవి పూ­ర్తి­గా రేర్ ఎర్త్ మూ­ల­కా­ల­పై ఆధా­ర­ప­డ­క­పో­యి­నా, తక్కువ శక్తి­వం­తం­గా ఉం­టా­యి. ఈ లో­టు­ను పూ­రిం­చ­డా­ని­కి మో­టా­ర్ డి­జై­న్‌­లో మా­ర్పు­లు, అధిక శక్తి­ని ని­లు­పు­కు­నే కొ­త్త పదా­ర్థాల శోధన కొ­న­సా­గు­తోం­ది. అలా­గే, కొ­న్ని పరి­శో­ధ­న­లు భారీ రేర్ ఎర్త్ మూ­ల­కాల తొ­ల­గిం­పు­పై కేం­ద్రీ­కృ­త­మ­య్యా­యి, తద్వా­రా మో­టా­ర్ల రూ­ప­క­ల్ప­న­లో తక్కువ మా­ర్పు­ల­తో­నే ఉత్ప­త్తి సా­ధ్య­మ­వు­తుం­ది. మరొక ఆస­క్తి­క­ర­మైన ది­శ­గా శా­శ్వత అయ­స్కాం­తాల స్థా­నం­లో వి­ద్యు­ద­య­స్కాం­తాల వి­ని­యో­గం, ఇది ఎల­క్ట్రి­క్ వాహన పరి­శ్ర­మ­కు పూ­ర్తి­గా కొ­త్త మా­ర్గా­న్ని తె­ర­వ­వ­చ్చు. ఈ పద్ధ­తి పర్యా­వ­రణ పరం­గా కూడా మే­లై­న­ది, ఎం­దు­కం­టే రేర్ ఎర్త్ తవ్వ­కా­లు పర్యా­వ­ర­ణం దె­బ్బ­తి­నే అవ­కా­శా­ల­ను తగ్గి­స్తా­యి. ఆర్థిక, పర్యా­వ­రణ సమ­తు­ల్యత: భా­ర­త­దే­శం తీ­సు­కుం­టు­న్న ఈ చర్య­లు కే­వ­లం వా­ణి­జ్య­ప­ర­మై­న­వి మా­త్ర­మే కావు. ఇవి స్థి­ర­త్వం, ఆత్మ­ని­ర్భ­రత ది­శ­గా పె­ద్ద అడు­గు­లు అని చె­ప్ప­వ­చ్చు. అరు­దైన భూమి మూ­ల­కా­ల­ను తవ్వ­డం­లో పర్యా­వ­రణ దు­ష్ప్ర­భా­వా­ల­ను తగ్గి­స్తూ, రీ­సై­క్లిం­గ్, రీ­యూ­జ్ సాం­కే­తి­క­త­ల­ను ప్రో­త్స­హి­స్తోం­ది.

Tags

Next Story