CREDIT CARD: క్రెడిట్ కార్డుతో డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..?

అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ సదుపాయం ఎంత వరకు ఉపయోగపడుతుందో, అంతకన్నా ఎక్కువగా ఛార్జీల రూపంలో భారం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నిపుణులు ఆపత్కాలంలో తప్ప ఈ ఎంపికను ఉపయోగించవద్దంటున్నారు.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు
క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే, అది సాధారణ లావాదేవీ కాదని గుర్తించాలి. దీనిపై 2.5% నుంచి 3% వరకు క్యాష్ అడ్వాన్స్ ఫీజు, కనీసం రూ.250 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తారు.
ఫైనాన్స్ ఛార్జీలు
నగదు తీసుకున్న రోజే వడ్డీ లెక్కింపు మొదలవుతుంది. విత్‌డ్రా చేసిన తేదీ నుంచి బిల్లింగ్ డేట్ వరకు నెలకు 2.5% నుంచి 3.5% వరకు వడ్డీ వసూలు అవుతుంది. సాధారణ లావాదేవీలకు ఉన్న గ్రేస్ పీరియడ్ ఇది వర్తించదు.
లేట్ పేమెంట్ ఛార్జీలు
విత్‌డ్రా చేసిన మొత్తం పూర్తిగా చెల్లించకపోతే, ఔట్‌స్టాండింగ్‌పై 15% నుంచి 30% వరకు లేట్ పేమెంట్ ఫీజు పడుతుంది. దీంతోపాటు క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
డబ్బులు ఎంత విత్‌డ్రా చేయవచ్చు?
ప్రతి బ్యాంక్‌కి విత్‌డ్రా పరిమితి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కార్డ్ లిమిట్‌లో 40 శాతం వరకు నగదు తీసుకునే సౌలభ్యం ఉంది.
నిపుణుల సూచన
తప్పనిసరి అయితే తప్ప క్యాష్ విత్‌డ్రా చేయవద్దు. ఒకవేళ తీసుకుంటే, వీలైనంత త్వరగా తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా, విత్‌డ్రా చేసే ముందు మీ బ్యాంక్ ఛార్జీలు తెలుసుకొని, ఆమోదయోగ్యంగా ఉంటేనే ఆచరణలో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం వల్ల అనేక లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి క్యాష్ విత్‌డ్రా చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ, క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ విత్‌డ్రా చేయడం చాలా రిస్క్ కూడా. ఇలా చేయడం వల్ల మీరు భారీ ఛార్జీలను చెల్లించాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డును వాడేటప్పుడు.. మీరు అనేక రకాల ఛార్జీలు చెల్లించాలి. మీరు క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ మొత్తంపై వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com