New Cars : క్రెటా కోటపై కొత్త కార్ల దండయాత్ర.. మార్చిలోనే మూడు అదిరిపోయే SUVలు లాంచ్.

New Cars : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్ సైజ్ SUVల హవా నడుస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు ఈ సెగ్మెంట్లో రారాజులుగా వెలుగొందుతున్నాయి. అయితే ఈ ఏడాది ఈ రారాజుల కోటను బద్దలు కొట్టడానికి సరికొత్త కార్లు సిద్ధమవుతున్నాయి. టాటా సియెర్రా నుంచి మారుతి ఈ-విటారా వరకు ఇప్పటికే మార్కెట్లో సందడి మొదలవ్వగా, రాబోయే కొన్ని నెలల్లో క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే మరో మూడు అద్భుతమైన ఎస్‌యూవీలు లాంచ్ కానున్నాయి.
టయోటా అర్బన్ క్రూజర్ ఇబెలా
టోయోటా నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, యూరోపియన్ లుక్‌తో కనిపిస్తుంది. ఇది మారుతి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి ఉన్నప్పటికీ, దీని డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ముఖ్యంగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లీక్ ఫ్రంట్ లుక్ కారుకు స్పెషల్ అట్రాక్షన్. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒక వేరియంట్ 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, మరొకటి ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మార్చి నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
ఆల్-న్యూ రెనాల్ట్ డస్టర్
ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ క్రేజ్ పెంచిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు థర్డ్ జనరేషన్ మోడల్‌తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తోంది. మార్చి 17న విడుదల కాబోతున్న ఈ కొత్త డస్టర్‌లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 17 రకాల ADAS సేఫ్టీ ఫీచర్లు ఉండబోతున్నాయి. తొలుత ఇది 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లతో వస్తుంది. ఇక ఏడాది చివరలో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా రెనాల్ట్ తీసుకురానుంది. పాత డస్టర్ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడానికి రెనాల్ట్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది.
కొత్త స్కోడా కుషాక్
కుషాక్ ప్రియుల కోసం స్కోడా ఈ ఏడాది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. ఇది చూడటానికి మరింత షార్ప్‌గా, హైటెక్ ఫీచర్లతో కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా వెనుక సీట్లకు మసాజ్ ఫీచర్‌ను స్కోడా పరిచయం చేస్తోంది. వీటితో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్ వంటి అప్‌గ్రేడ్లు ఇందులో ఉండనున్నాయి. ఇది కూడా మార్చి నెలలోనే మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కార్లు గనుక వస్తే మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ రసవత్తరంగా మారడం ఖాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
