New SUVs : టాటా సియెర్రా నుంచి మారుతి ఈ-విటారా వరకు..ఇండియన్ మార్కెట్ ట్రెండ్ మార్చనున్న ఎస్యూవీలివే.

New SUVs : భారతీయ మార్కెట్లో చాలా కాలంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా రాజులా ఏలుతోంది. కానీ ఇకపై క్రెటా ప్రయాణం అంత సులభం కాకపోవచ్చు. 2026 నాటికి భారత మార్కెట్‌లోకి అనేక సరికొత్త ఎస్యూవీ మోడల్స్, ఫేస్‌లిఫ్ట్‌లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడల్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కలిసి క్రెటా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 8 మిడ్-సైజ్ SUV ల వివరాలను చూద్దాం.
టాటా సియెర్రా
టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటాకు అత్యంత బలమైన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది. ఇది 25 నవంబర్ 2025న మార్కెట్‌లోకి రానుంది. మొదట్లో మూడు ICE (సాధారణ ఇంజిన్) ఆప్షన్లలో లభిస్తుంది – 1.5L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L టర్బో డీజిల్. 2026 ప్రారంభంలో దీని ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా రానుంది. హారియర్ ఈవీ పవర్‌ట్రైన్‌ను సియెర్రా ఈవీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది.
మారుతి ఈ-విటారా
మారుతి సుజుకి మొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఈ-విటారా. 2 డిసెంబర్ 2025న అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. హార్టెక్ట్-ఈ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతుంది. 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదు. చిన్న బ్యాటరీతో 144bhp, పెద్ద బ్యాటరీ (AWD సెటప్)తో సుమారు 174bhp, 184bhp పవర్ ఉత్పత్తి చేయవచ్చు.
కొత్త జనరేషన్ కియా సెల్టోస్
ప్రస్తుతం క్రెటాకు ప్రధాన పోటీదారుగా ఉన్న కియా సెల్టోస్ కూడా కొత్త జనరేషన్‌లో మరింత ఆధునిక ఫీచర్లతో వస్తోంది.దీనిని 10 డిసెంబర్ 2025న ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. 2026 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. కొత్త డిజైన్, పెద్ద 12.3-అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా. హైబ్రిడ్ పవర్‌ట్రైన్ 2027 లో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. అప్పటివరకు ప్రస్తుత ఇంజిన్ సెటప్‌తోనే కొత్త సెల్టోస్ లభిస్తుంది.
కొత్త రెనాల్ట్ డస్టర్
మూడవ తరం రెనాల్ట్ డస్టర్ లుక్, ఫీచర్లలో పూర్తిగా భిన్నంగా ఉండనుంది. భారత అరంగేట్రం 26 జనవరి 2026న జరుగుతుంది. పాత మోడల్ కంటే చాలా భిన్నంగా, మరింత ప్రీమియం ఇంటీరియర్‌తో వస్తుందని అంచనా. అధికారిక వివరాలు ఇంకా రానప్పటికీ, 1.3 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.
స్కోడా కుషాక్ / వోక్స్‌వ్యాగన్ టైగన్
పోటీ పెరుగుతున్న నేపథ్యంలో స్కోడా, వోక్స్‌వ్యాగన్ తమ మిడ్-సైజ్ కార్లు - కుషాక్, టైగన్‌లకు మిడ్ లైఫ్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. రెండు SUVలలో ADAS (అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సేఫ్టీ ఫీచర్ ఉండే అవకాశం ఉంది. ఈ 2026 మోడల్స్ ప్రస్తుత పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతోనే అందుబాటులో ఉంటాయి.
హోండా ఎలివేట్ హైబ్రిడ్
హోండా ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్ భారతదేశంలో మొదటి హైబ్రిడ్ SUV కానుంది. 2026 రెండవ భాగంలో సుమారు దీపావళి సమయంలో భారతీయ రోడ్లపైకి రానుంది. సిటీ ఇ:HEV హైబ్రిడ్ సెడాన్‌లో ఉపయోగించిన పవర్‌ట్రైన్‌నే ఎలివేట్ హైబ్రిడ్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలివేట్ 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తోంది.
నిస్సాన్ టెక్టన్
నిస్సాన్ టెక్టన్ అనేది కొత్త రెనాల్ట్ డస్టర్ రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్. ఇది డస్టర్ ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు, విడిభాగాలు, ఇంజిన్‌ను పంచుకుంటుంది. ఇది కూడా 1.3 లీటర్ పెట్రోల్ లేదా 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

