IPhone :ఐఫోన్ 17 కోసం ఎగబడ్డ జనం: యాపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్లు.. తోపులాట

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా విక్రయాలు ప్రారంభం కావడంతో, ముంబై, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ వద్ద జనం అర్థరాత్రి నుంచే క్యూ కట్టారు. దీంతో అక్కడ తీవ్రమైన తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని గొడవలు జరగకుండా చూశారు. అదే విధంగా ఢిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేసిన అమన్ మెమన్ అనే కస్టమర్ తన ఆనందాన్ని పంచుకుంటూ, గత ఆరు నెలలుగా ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మోడళ్లు, ధరలు:
యాపిల్ ఈసారి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడళ్లను తీసుకొచ్చింది. ఈసారి బేస్ మోడళ్లను 256జీబీ వేరియంట్‌లో విడుదల చేయడం విశేషం.
ఐఫోన్ 17: రూ. 82,900
ఐఫోన్ 17 ఎయిర్: రూ. 1,19,900
ఐఫోన్ 17 ప్రో: రూ. 1,34,900
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: రూ. 1,49,900
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com