Dmart : డీమార్ట్‌కు భారీ లాభాలు... రూ.710.37 కోట్ల నికర లాభం

Dmart : డీమార్ట్‌కు భారీ లాభాలు... రూ.710.37 కోట్ల నికర లాభం
X

దేశవ్యాప్తంగా డీమార్ట్‌ పేరిట సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్‌ చైన్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే లాభంలో 8శాతం వృద్ధిచెందింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకాలపాల నుంచి వచ్చే ఆదాయం రూ.14,050.32 కోట్లకు చేరింది.గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.12,307.72 కోట్లతో పోలిస్తే 14శాతం పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం 5.6శాతం పెరిగి రూ.659 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్‌ ఎబిటా 10.3 శాతం పెరిగి రూ.1,105 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కొత్తగా ఆరు స్టోర్‌లను జోడించింది.

Tags

Next Story