Debt to Income Ratio : మీకు లోన్ కావాలా? క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు..DTI స్కోర్‌ కూడా బ్యాంకులు చూస్తాయి.

Debt to Income Ratio : మీకు లోన్ కావాలా? క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు..DTI స్కోర్‌ కూడా బ్యాంకులు చూస్తాయి.
X

Debt to Income Ratio :బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు లోన్స్ ఇవ్వడమే. అయితే హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటివి ఒక ఆస్తిని తాకట్టు పెడతారు కాబట్టి అవి బ్యాంక్‌కు చాలా సురక్షితం. కానీ పర్సనల్ లోన్ వంటివి ఎలాంటి తాకట్టు లేకుండా ఇస్తారు కాబట్టి, అవి బ్యాంక్‌కు కొంత రిస్క్ అవుతాయి. అందుకే పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు చాలా జాగ్రత్త పడతాయి. కస్టమర్ క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, DTI (Debt to Income Ratio) అనే మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చాలా సీరియస్‌గా పరిశీలిస్తాయి. ఈ రెండింటిలో మంచి భరోసా ఉన్న కస్టమర్‌లకే సులభంగా, తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంది.

DTI స్కోర్ అంటే ఏమిటి?

DTI అంటే Debt to Income Ratio (డెట్ టు ఇన్‌కమ్ రేషియో). దీన్నే ఆదాయం, అప్పుల నిష్పత్తి అని కూడా అంటారు. అంటే, అప్పు కస్టమర్ ఆదాయంలో ఎంత శాతం ఉంది లేదా ఎంత శాతం అయ్యే అవకాశం ఉంది అని బ్యాంక్ లెక్క వేస్తుంది. సాధారణంగా చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 40 శాతం కంటే తక్కువ డెట్ టు ఇన్‌కమ్ రేషియో ఉన్న కస్టమర్‌లకు లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. ఒకవేళ కస్టమర్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటే, 50 శాతం డెట్ టు ఇన్‌కమ్ రేషియో ఉన్నా కూడా కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వడానికి అంగీకరిస్తాయి.

DTI నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు?

DTI నిష్పత్తి ఒక వ్యక్తి అప్పుల భారాన్ని, ఆ అప్పులను తిరిగి చెల్లించే శక్తిని సూచిస్తుంది. ఇది బ్యాంక్‌కు చాలా ముఖ్యం.

ఉదాహరణ: మీ నెలవారీ ఆదాయం రూ.60,000 అనుకుందాం. మీ పాత లోన్స్ EMI, క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నీ కలిపి నెలకు రూ.30,000 చెల్లిస్తున్నట్లయితే మీ DTI నిష్పత్తి 50 శాతం అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి 50 శాతం కంటే ఎక్కువ అప్పుల భారం మోయడం కష్టమని బ్యాంకులు భావిస్తాయి.

బ్యాంకు లోన్ ఎంత ఇస్తుంది?

మీరు ఎంత లోన్ తీసుకోగలరో DTI నిష్పత్తిని ఉపయోగించి బ్యాంకులు నిర్ణయిస్తాయి. మీ ఆదాయం రూ.60,000 ఉండి, మీ పాత అప్పులు నెలకు రూ.10,000 అనుకుందాం. బ్యాంక్ 40 శాతం DTI వరకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, రూ.60,000లో 40 శాతం అంటే రూ.24,000 వరకు EMI ఉండవచ్చు. మీరు ఇప్పటికే రూ.10,000 EMI కడుతున్నారు కాబట్టి, కొత్తగా మీరు నెలకు రూ.14,000 (రూ.24,000 - రూ.10,000) వరకు EMI కట్టే సామర్థ్యం ఉందని బ్యాంక్ భావిస్తుంది. దీనికి అనుగుణంగా, రూ.14,000 EMI వచ్చేంత మొత్తంలో పర్సనల్ లోన్ ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధమవుతుంది. కాబట్టి లోన్ కోసం అప్లై చేసే ముందు, మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు ఈ DTI రేషియోను కూడా చెక్ చేసుకుంటే మీకు లోన్ త్వరగా, మంచి వడ్డీ రేటుకు వచ్చే అవకాశం ఉంటుంది.

Tags

Next Story