Gold Price : ఉన్నోళ్లకు గుడ్ న్యూస్..లేనోళ్లకు బ్యాడ్ న్యూస్.. రికార్డు క్రియేట్ చేసిన బంగారం ధర.

Gold Price : ఉన్నోళ్లకు గుడ్ న్యూస్..లేనోళ్లకు బ్యాడ్ న్యూస్.. రికార్డు క్రియేట్ చేసిన బంగారం ధర.
X

Gold Price : ప్రపంచ స్థాయిలో నెలకొన్న అనిశ్చితులు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాల మధ్య, అక్టోబర్ 1, బుధవారం నాడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఈ రోజు కూడా బంగారం పెట్టుబడిదారులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి ఆప్షన్ గా నిలుస్తోంది. భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, దీనికి శుభసూచకంగా కూడా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు తరచుగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.

ఢిల్లీలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,740 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,18,604, 18 క్యారెట్ల బంగారం రూ.97,040 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,22,877, 22 క్యారెట్ల బంగారం రూ.1,13,202, 18 క్యారెట్ల బంగారం రూ.92,621 చొప్పున అమ్ముడవుతోంది. కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,26,744, 22 క్యారెట్ల బంగారం రూ.1,16,765, 18 క్యారెట్ల బంగారం రూ.95,536 గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతి 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం రూ.1,28,366, 22 క్యారెట్ల బంగారం రూ.1,18,259, 18 క్యారెట్ల బంగారం రూ.96,758 చొప్పున అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,200 పెరిగి రూ.1,17,440 నుంచి రూ.1,18,640కి చేరుకుంది. ఇక 22 క్యారట్ బంగారం ధర చూస్తే నేడు రూ.1100 పెరిగి రూ.1,07,650 నుంచి రూ.1,08,750 కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.900 పెరిగి రూ.88,080 నుంచి రూ.88,980కి పెరిగింది.

Tags

Next Story