Diwali 2025 Car Offers : కొత్త కారు కొనేవారికి పండగ.. టాప్ కార్లపై రూ.3 లక్షల వరకు భారీ తగ్గింపు.

Diwali 2025 Car Offers : కొత్త కారు కొనేవారికి పండగ.. టాప్ కార్లపై రూ.3 లక్షల వరకు భారీ తగ్గింపు.
X

Diwali 2025 Car Offers : ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, దీపావళి 2025 ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. దాదాపు అన్ని కార్లు, ఎస్‌యూవీలపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ మోడల్స్‌పై ఏకంగా రూ.3 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. రూ.లక్ష నుండి ప్రారంభమయ్యే ఈ దీపావళి ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈ దీపావళికి తన మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మారుతి బలెనో డెల్టా ఏఎమ్‌టి మోడల్‌పై మొత్తం రూ.1.05 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.55,000 విలువైన రీగల్ కిట్ ఉన్నాయి. బలెనో ఏఎమ్‌టి వేరియంట్‌లపై రూ.1.02 లక్షల వరకు, మ్యాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్‌లపై రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు.

మారుతి ఇన్విక్టో ఆల్ఫా మోడల్‌పై మొత్తం రూ.1.40 లక్షల వరకు తగ్గింపు (రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ + రూ.1.15 లక్షల స్క్రాపేజ్ బోనస్) లభిస్తోంది. జెటా+ వేరియంట్‌పై రూ.1.15 లక్షల స్క్రాపేజ్ బోనస్ మాత్రమే ఉంది.

కియా మోడల్స్‌పై కూడా దీపావళి ఆఫర్‌లు భారీగా ఉన్నాయి కియా సోనెట్ ఎస్‌యూవీపై రూ.1.03 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 స్క్రాపేజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

కియా సెల్టోస్ పై కొనుగోలుదారులు రూ.1.47 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. దీనిపై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తున్నాయి.

కియా క్యారెన్స్ మోడల్‌పై రూ.1.6 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

హోండా సిటీ పై మొత్తం రూ.1.27 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. మిడ్-లెవెల్ హైలైట్ ఏటీ వేరియంట్‌పై రూ.1.60 లక్షల వరకు, జీటీ ప్లస్ పెట్రోల్-డీసీటీ వేరియంట్‌పై రూ.1.25 లక్షల వరకు, జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ డీసీటీ వేరియంట్‌పై రూ.1.30 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ టైగన్ హైలైన్ ప్లస్, టాప్ లైన్ 1.0L టర్బో-పెట్రోల్ ఏటీ వేరియంట్‌లపై వరుసగా రూ.లక్ష, రూ.1.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. టైగన్ జీటీ ప్లస్ క్రోమ్ పై రూ.1.5 లక్షల వరకు, జీటీ ప్లస్ స్పోర్ట్ పెట్రోల్ డీసీటీ వేరియంట్‌పై రూ.1.60 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి.హోండా ఎలివేట్ పై కొనుగోలుదారులు రూ.1.51 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

మారుతి గ్రాండ్ విటారా పై దాదాపు రూ.1.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. స్కోడా స్లావియా సెడాన్, కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మోడల్స్‌పై దీపావళికి భారీగా రూ.2.25 లక్షల, రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మహీంద్రా ఎక్స్ యూవీ400 సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారుపై రూ.2.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మహీంద్రా మరాజో దీపావళి సీజన్‌లో అత్యధిక తగ్గింపు ఉన్న కార్లలో ఇది ఒకటి. దీనిపై ఏకంగా రూ.3 లక్షల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ దీపావళి ఆఫర్‌లతో మీకు నచ్చిన కారును కొని, పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి.

Tags

Next Story