Punch vs Exter : టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్టర్..ఏ మినీ ఎస్‌యూవీ మొనగాడు?

Punch vs Exter : టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్టర్..ఏ మినీ ఎస్‌యూవీ మొనగాడు?
X

Punch vs Exter : భారతదేశంలో మినీ ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాటా పంచ్ ఇప్పటికే ఈ విభాగంలో రారాజుగా కొనసాగుతుండగా, హ్యుందాయ్ ఎక్స్టర్ దానికి గట్టి పోటీనిస్తోంది. ఇప్పుడు 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రావడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. టాటా పంచ్ ఇప్పుడు కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది. మరి ఈ రెండింటిలో మీకు ఏది సరిపోతుందో తెలుసుకోండి.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్ లుక్‌తో ఉంది. దీని పొడవు 3,876 మి.మీ (మునుపటి కంటే 49 మి.మీ ఎక్కువ), వెడల్పు 1,742 మి.మీ. దీనికి ఉన్న 187 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ఒక పక్కా ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తుంది. మరోవైపు హ్యుందాయ్ ఎక్స్టర్ కాస్త ఎత్తుగా (1,631 మి.మీ) ఉంటుంది, కానీ వెడల్పు (1,710 మి.మీ) తక్కువ. ఎక్స్టర్ వీల్‌బేస్ 2,450 మి.మీ కాగా, పంచ్ వీల్‌బేస్ 2,445 మి.మీ. అంటే లోపల స్పేస్ విషయంలో రెండూ దాదాపు సమానంగా ఉన్నా, రోడ్డుపై పంచ్ ఎక్కువ వెడల్పుగా కనిపిస్తుంది.

ఇక్కడ టాటా పంచ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. పంచ్‌లో ఇప్పుడు మూడు ఆప్షన్లు ఉన్నాయి: 1.2లీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, ఐ-సిఎన్జీ (iCNG) మరియు కొత్తగా వచ్చిన 1.2లీ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ టర్బో ఇంజిన్ 118 bhp పవర్‌ను ఇస్తుంది. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ మరియు హైవేలపై పంచ్ చాలా వేగంగా వెళ్లగలదు. హ్యుందాయ్ ఎక్స్టర్‌లో కేవలం 1.2లీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది, ఇది సిటీ డ్రైవింగ్‌కు బాగుంటుంది కానీ పంచ్ టర్బో రేంజ్‌ను అందుకోలేదు.

టెక్నాలజీ విషయానికి వస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్టర్‌లో 8-అంగుళాల స్క్రీన్, డాష్‌క్యామ్, సన్‌రూఫ్ ఉన్నాయి. సేఫ్టీలో టాటా పంచ్ ఎప్పుడూ తోపే. ఇది ఇప్పటికే భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఎక్స్టర్ లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి, కానీ క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో పంచ్ దే పైచేయి.

Tags

Next Story