Dussehra Sales : దసరా సేల్స్.. ఈ కామర్స్​ సంస్థల భారీ ఆఫర్లు

Dussehra Sales : దసరా సేల్స్.. ఈ కామర్స్​ సంస్థల భారీ ఆఫర్లు

బతుకమ్మ, దసరా ఫెస్టివల్స్​ ను పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్​ సంస్థలు.. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ఎలక్ట్రానిక్​ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. క్రెడిట్​ కార్డులు, ఈఎంఐ చెల్లింపులకూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. వివిధ ఈ కామర్స్​ సంస్థల సేల్స్​, ప్రకటించిన డిస్కౌంట్ల వివరాలు ఇవీ..

ప్రముఖ ఈ -కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దసరా పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ఇప్పటికే ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచే మొదలైంది. మరో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27వ తేదీ నుంచే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌’ నిర్వహిస్తున్నది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో కొనుగోలుదారులకు దసరా పండగ ముందుగానే మొదలైంది.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌/ క్రెడిట్‌ కార్డ్‌పై డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డు(ఏటీఎం)తో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. మరోవైపు అమెజాన్‌ పే యూపీఐపై కూడా డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. రూ.1000 పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50- నుంచి 80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అయితే.. ప్రొడక్ట్‌లపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Tags

Next Story