Upcoming EVs : ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల యుద్ధం..మార్కెట్‌ను ఏలబోతున్న 4 కొత్త EV మోడల్స్.

Upcoming EVs : భారతీయ మార్కెట్‌లో ఇప్పుడు కస్టమర్లు ఎస్‌యూవీ కార్లంటే బాగా ఇష్టపడుతున్నారు. అందుకే కంపెనీలు కూడా కొత్త కొత్త ఎస్‌యూవీలను విడుదల చేస్తున్నాయి. మీరు కూడా డిసెంబర్ 2025 లేదా 2026లో కొత్త ఎస్‌యూవీ కొనాలని అనుకుంటున్నట్లయితే రాబోయే 6 నుంచి 9 నెలల్లో మార్కెట్‌లోకి వస్తున్న 4 ముఖ్యమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా మహీంద్రా, టాటా సంస్థలు ఈ రంగంలో దూకుడు పెంచాయి.
1. మహీంద్రా XEV 9S
XEV 9S మార్కెట్‌లోకి వస్తే ఇది మహీంద్రా నుంచి వస్తున్న మొదటి మూడు వరుసల ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. ఇది మహీంద్రా ప్రత్యేకమైన INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్ పై తయారైంది. ఈ ఎస్‌యూవీలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రేంజ్ ఉంటుందని అంచనా. ఇది ఫ్లాగ్‌షిప్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా వస్తుంది. ఎక్కువ స్థలం, లగ్జరీ ఫీచర్లు, సుదూర ప్రయాణాలు ఇష్టపడే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని తయారు చేస్తున్నారు.
2. మహీంద్రా XUV 3XO EV
మహీంద్రా చిన్న ఎలక్ట్రిక్ కార్ల ప్లాన్‌లో XUV 3XO EV కూడా ఉంది. ఈ కారు ఇప్పటికే టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఈ మోడల్ మార్కెట్‌లోకి వస్తే, ఇది టాటా కంపెనీకి చెందిన పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ మోడల్స్‌లోని కొన్ని వేరియంట్లకు గట్టి పోటీ ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారి కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
3. మారుతి సుజుకి e విటారా
మారుతి సుజుకి నుంచి వస్తున్న మొదటి మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. ఇది త్వరలోనే భారతీయ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ కారులో కూడా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయి.
4. టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నవంబర్ 25న భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేశారు. సియెర్రా ఈవీలో, హారియర్ ఈవీ కంటే పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 542 కి.మీ నుంచి 656 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదు. ఈ ఎస్‌యూవీలో కూడా వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

