Festive Offers: ఆన్‌లైన్ షాపింగ్.. ఆ వస్తువు అవసరమో కాదో ఓసారి ఆలోచించి..

Festive Offers: పండగ సీజన్.. ఆన్‌లైన్లో ఆఫర్లు, డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఆ వస్తువు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్లు కనిపించేసరికి కొనాలని ఆరాటపడుతుంటారు. పండగలకు షాపింగ్ చేసే రోజులు పోయాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనేయడమే.. నెలాఖరు వచ్చే సరికి అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు. అందుకే ముందస్తు ప్రణాళిక ముఖ్యం. అది అవసరమా కాదా అని ఇంటి సభ్యులతో చర్చించి మాత్రమే కొనుగోలు చేయాలి. కొన్న తరవాత కొత్త మోతలో ఓ వారం వాడి పక్కన పడేస్తుంటారు. అలా చేయడం సరికాదు.
ఆఫర్ ఉందనో, తక్కువ ధరకు వస్తుందనో వేలకు వేలు ఖర్చు పెట్టి వస్తువులను కొని ఉపయోగం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మీ సమయాన్ని ఆదాచేస్తుందనో, మీ అవసరం తీరుతుందనో అని మీకు కచ్చితంగా అనిపిస్తే కొనుగోలు చేయండి. అందుకు మీ ఆర్థిక పరిస్థితి కూడా సహకరిస్తుందని భావిస్తేనే ముందడుగు వేయండి.
అప్పు చేసే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టండి.. ఇప్పుడేదో ఫ్రండ్ అని మొహమాటంతో ఇచ్చినా రేపు అతని అవసరానికి మనం మనీ సర్థలేకపోతే ఇబ్బంది. స్నేహం పాడవుతుంది. వస్తువులకంటే స్నేహం ముఖ్యం. వాస్తవానికి ఏదైనా పెద్ద వస్తువు సేల్‌లో కొనాలని భావిస్తే ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసి పెట్టుకోండి. నెలకు కొంత తీసి పక్కన పెట్టుకోండి. నిజంగా రాయితీ వస్తుందా లేదా అని ముందు నుంచి గమనించండి. మార్కెట్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోండి. కొన్ని వస్తువులపై ఇస్తున్న రాయితీలు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు అవి అన్నీ వర్తిస్తాయో లేదో తెలుసుకోండి.
కొనాలన్న మోజులో పడి ఆ వస్తువు కొత్తదో కాదో తెలుసుకోకుండా కొనుగోలు చేయకండి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పటి కప్పుడు అవసరాలకు అనుగుణంగా మారుతుంటాయి. రెండేళ్ల క్రితం వచ్చిన వెర్షన్‌కి ఇప్పటి వెర్షన్‌కి తేడా ఉంటుంది. ఫీచర్లు ఎక్కువ వుంటాయి. అందుకే అప్ గ్రేడ్ వెర్షన్ అవునో కాదో తెలుసుకొని కొనుగోలు చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com