FINTECH: ఫిన్‌టెక్ రంగంలో భారత్‌కు గ్లోబల్ గుర్తింపు

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తాజా నివేదికలో భారత్ ఫిన్‌టెక్ రంగంలో అగ్రగామిగా నిలిచిన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అమెరికా, బ్రిటన్, సింగపూర్, బ్రెజిల్ వంటి దేశాల సరసన భారత్ స్థానం దక్కించుకుంది. చైనాలోని టియాన్జిన్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో ఈ నివేదికను విడుదల చేసింది. ఫిన్‌టెక్ రంగం ఇప్పుడు లాభదాయకమైన దశలోకి ప్రవేశించిందని, స్థిరీకరణ దిశగా వేగంగా దూసుకెళ్తోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన అల్టర్నేటివ్ ఫైనాన్స్ సెంటర్‌తో భాగస్వామ్యంలో తయారైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 ఫిన్‌టెక్ సంస్థలపై సర్వే నిర్వహించారు. ఇందులో, వినియోగదారుల వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని 37%, ఆదాయ వృద్ధితో ఆర్థిక పనితీరు బలంగా ఉందని 40%, లాభాల్లో మెరుగుదల కనిపించిందని 39% సంస్థలు పేర్కొన్నాయి. ఫిన్‌టెక్ ఖాతాదారుల్లో 57% మైక్రో, స్మాల్, మిడియం ఎంటర్ప్రైజెస్ (MSMEs), 47% తక్కువ ఆదాయాల ప్రజలు, 41% మహిళలుగా ఉన్నారు. ఇది ఆర్థిక చొరసత్వాన్ని విస్తరిస్తున్న సంకేతం. సంస్థల పనితీరును మెరుగుపరచడం లో కృత్రిమ మేధ (AI) కీలక పాత్ర పోషిస్తున్నదని 83% ఫిన్‌టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి.
అయితే, ఫిన్‌టెక్ వృద్ధికి స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రధాన అడ్డంకిగా 18% సంస్థలు పేర్కొన్నాయి. ఈ సంఖ్య 2024లో 56%కి చేరింది. నిధుల సమీకరణ సవాళ్లు గతేడాదితో పోలిస్తే తగ్గాయని 12% సంస్థలు వెల్లడించాయి (2023లో ఇది 40%). ఈ నివేదిక ద్వారా భారత్ ఫిన్‌టెక్ రంగంలో గ్లోబల్ మానిటర్‌గా ఎదుగుతోందన్న స్పష్టత వచ్చింది. సాంకేతికత, వినూత్న సేవలు, విస్తృత వినియోగదారుల పరిరక్షణతో ఫిన్‌టెక్ రంగం భారత్‌లో భవిష్యత్తులో మరింత శక్తివంతంగా ఎదిగే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత త్వరగా స్వీయ నియంత్రణ వ్యవస్థను ఫిన్‌టెక్ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ఆర్బీఐ నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఆర్బీఐ ఛైర్మన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com