SUV MG Windsor : మార్కెట్ లోకి తొలి సీయూవీ ఎంజీ విండ్సర్

భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. ఇటీవల దీన్ని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించింది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్‌యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది. ఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ.15,49,800లుగా కంపెనీ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com