iPhone Offers : ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌ గుడ్‌న్యూస్‌ .. ఐఫోన్‌ భారీ డిస్కౌంట్‌

iPhone Offers : ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌ గుడ్‌న్యూస్‌ .. ఐఫోన్‌ భారీ డిస్కౌంట్‌
X

ఏడాదికోసారి వచ్చే పండగ సేల్స్‌లో ఐఫోన్‌ ఎప్పుడెప్పుడు కొనుగోలు చేద్దామా అని ఎదురుచూస్తున్న టెక్‌ ప్రియులకు ప్రముఖ ఇ- కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాయి. ఈ రెండు సంస్థలు నిర్వహిస్తున్న సేల్స్‌లో ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. పెద్దఎత్తున రాయితీ, బ్యాంక్‌ ఆఫర్లతో తక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నాయి. ఇటీవల ఐఫోన్‌15 ధరను యాపిల్‌ తగ్గించింది.128 జీబీ బేస్‌ వేరియంట్‌ ధర రూ.69,900గా నిర్ణయించింది. తాజా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఈ మొబైల్‌ ధర రూ.54,999గా ఉంది. అంటే దాదాపు రూ.14వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీనిపై ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అదనపు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌ సాయంతో కొనుగోలు చేస్తే మరో రూ.2,000 తగ్గింపు పొందొచ్చని ప్రకటించింది. అంటే అదనంగా మరో రూ.5వేల తగ్గింపుతో ఐఫోన్‌ 15ను రూ.49,999కే కొనుగోలు చేయొచ్చు.

ఇక ఐఫోన్‌ 13పై అమెజాన్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ రూ.41,999కే విక్రయిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చు. అంటే ఐఫోన్‌13 బేస్‌ వేరియంట్‌ రూ.39,999కే లభిస్తుంది. 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా డిస్‌ప్లే, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో దీన్ని తీసుకొచ్చారు. డ్యుయల్‌ కెమెరా 12 ఎంపీ సెన్సర్‌, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3240ఎంఏహెచ్ బ్యాటరీ, 15డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో మూడేళ్ల క్రితం ఈ ఫోన్‌ను యాపిల్‌ లాంచ్‌ చేసింది.

Tags

Next Story