Flipkart : క్విక్ కామర్స్ కి ఫ్లిప్‌కార్ట్
క్విక్ కామర్స్ బిజి నెస్ .. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేసే సర్వీస్ కు ఫేమస్. ఈ సర్వీస్ లోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించింది. మినిట్స్ పేరుతో ఈ సేవలను ప్రారంభించింది. ముందుగా బెంగళూర్ లో పలు పిస్కోడ్స్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
రానున్న రోజుల్లో మిగిలిన నగరాలకు విస్తరించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వస్తువులను 10 నిమిషాల్లోనే డెలివరీ చేసే క్విక్ కామర్స్ విభాగంలో జొమాటోకి చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టిమార్ట్ జెప్టో, బిగ్ బాస్కెట్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ రంగంలో గట్టి పోటీ ఉంది. తాజాగా వాల్మార్ట్ మద్దతు ఉన్న ఫిప్ కార్ట్ కూడా ప్రవేశించడం ప్రాధాన్యత సంతరింరించుకుంది. కిరాణ సరకులతో పాటు. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ వంటి వాటిని 8-16 నిముషాల వ్యవధిలోనే ఫ్లిప్కార్ట్ డెలివరీ చేయనుంది. త్వరితగతిన సరకుల డెలివరీకి డార్క్ స్టోర్ల పేరుతో ఎక్క డిక్కడ చిన్న వేర్ హౌస్ లను ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి నుంచే డెలివరీ బాయ్లాతో తక్కువ వ్యవధిలోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com