New Car Launch : ఎస్‌యూవీ ప్రేమికులకు డబుల్ ధమాకా..ఫిబ్రవరిలోనే రెండు భారీ కార్ల ఎంట్రీ.

New Car Launch : ఫిబ్రవరి 2026 భారత్‌లోని ఎస్‌యూవీ ప్రియులకు నిజమైన పండగ నెల అని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న టయోటా ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించడానికి రెండు భారీ కాయం కలిగిన కార్లు రంగంలోకి దిగుతున్నాయి. అవే ఎంజీ మెజస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్-లైన్. ఈ రెండు కార్లు కూడా 7-సీటర్ సౌకర్యంతో, ప్రీమియం ఫీచర్లతో భారత్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే ఎస్‌యూవీ మనకు బాగా తెలిసిన టిగువాన్ ఆర్-లైన్ కు 3-రో వెర్షన్. దీనిని భారత్‌లోనే అసెంబుల్ చేయనున్నారు. ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 204 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని టాప్ స్పీడ్ గంటకు 224 కి.మీ. లోపల 15-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, మసాజ్ ఫీచర్ ఉన్న సీట్లు, అడ్వాన్స్‌డ్ యాంబియంట్ లైటింగ్‌తో ఇది ఒక విలాసవంతమైన భవనాన్ని తలపిస్తుంది. కేవలం రూ.51,000 టోకెన్ అమౌంట్ తో దీనిని ఆన్ లైన్ లో లేదా డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చు.
ఎంజీ మెజస్టర్
ఎంజీ గ్లోస్టర్ కు అప్‌డేటెడ్, స్పోర్టీ వెర్షనే ఈ మెజస్టర్. ఇది ఫిబ్రవరి 12న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. ఈ కారు డిజైన్ విదేశాల్లో విక్రయించే మాక్సస్ డి90 నుంచి తీసుకున్నారు. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది, ఇది 216 bhp పవర్, 479 Nm టార్క్‌ను అందిస్తుంది. అంటే ఆఫ్-రోడింగ్ లో ఇది ఒక పులిలా దూసుకుపోతుంది. 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఇందులో ఉండబోతున్నాయి.
ఫార్చ్యూనర్‌తో గట్టి పోటీ
ప్రస్తుతం ఇండియాలో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌దే పైచేయి. అయితే దాని ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కస్టమర్లు కొత్త ఆప్షన్ల కోసం చూస్తున్నారు. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి కార్లు ఉన్నప్పటికీ, ఎంజీ మెజస్టర్, టైరాన్ లు వాటికంటే మెరుగైన ఫీచర్లతో, సుమారు రూ.50 లక్షల లోపు ప్రారంభ ధరతో రానున్నట్లు అంచనా. ఈ పోటీ వల్ల అంతిమంగా లాభపడేది కారు కొనే కస్టమర్లే. అద్భుతమైన పవర్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, రాజసం ఉట్టిపడే లుక్స్ ఈ రెండు కార్ల సొంతం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
