Youtube Glitch : యూట్యూబ్ లో గ్లిచ్.. అంతరాయంపై యూజర్ల ఫిర్యాదు

ప్రముఖ వీడియో ప్లాట్ ఫాం యూట్యూబ్లో టెక్నికల్ సమస్య సోమవారం చాలామందిని ఆందోళనకు గురిచేసింది. యూట్యూబ్ యాప్, వెబ్సైట్లో ఈ అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్లోడ్ కావడం లేదంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియ రాలేదు. యూట్యూబ్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేవలం వీడియోలు అప్లోడింగ్ విషయంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చిన్నపాటి సాంకేతిక సమస్య అయి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
కాసేపట్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఐతే.. సర్వర్ సమస్యలతో యూట్యూబ్ లో ఇలాంటి గ్లిచ్ వస్తుంటుందని.. డేటా లాస్ మాత్రం ఉండదని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com