పసిడికి మళ్లీ రెక్కలు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

గత పది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపే మళ్లీ ధరలు పెరిగి పసిడి ప్రియులను నిరాశకు గురి చేస్తున్నాయి.
బంగారం ధర మళ్లీ పెరిగి పసిడి ప్రియులను షాక్ కి గురి చేస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.86,380కి చేరుకుంది. వెండి ధర కూడా పెరిగి కిలో రూ.98340కు చేరుకుంది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (24కే, 22కే)
న్యూఢిల్లీ: రూ.86,080; రూ.78,907
చెన్నై: రూ.86,480; రూ.79,273
బెంగళూరు: రూ.86,300; రూ.79,108
హైదరాబాద్: రూ.86,360; రూ.79,163
మరో వైపు, బంగారంపై లోన్లలో అవకతవకలను కట్టడి చేసేందుకు ఆర్బీఐ తాజా నిబంధనలను కఠినతరం చేసింది. బంగారం తనఖా పెట్టుకుని బ్యాంకులు లోన్లు జారీ చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లోన్ కోసం వచ్చే వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని, లోన్ నిధులు ఎందుకు వినియోగిస్తున్నారో కూడా ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. బ్యాంకుల్లో పసిడిపై రుణాలు పెరుగుతుండంతో పాటు అవకతవకలు కూడా జరుగుతున్నట్టు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com