Gold Prices : భారీగా పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర ఎంతంటే?

Gold Prices : దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ధరలు నవంబర్ 24న గణనీయంగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో 5 డిసెంబర్ ఎక్స్‌పైరీ ఉన్న గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ రూ.1,22,743 (10 గ్రాములకు) వద్ద ఓపెన్ అయింది. అంతకుముందు ట్రేడింగ్ రోజు రూ.1,24,191 వద్ద ముగిసిన పసిడి ధర, సోమవారం ఉదయం 10:30 గంటల సమయానికి రూ.1,22,749 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం అంతకుముందు రోజు ముగింపు ధరతో పోలిస్తే దాదాపు రూ.1,440 భారీ తగ్గుదలను సూచిస్తోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ బంగారం అత్యధికంగా రూ.1,23,300 స్థాయికి కూడా చేరుకుంది.
ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా సోమవారం పతనం కనిపించింది. వెండి కిలోకు రూ.1,52,989 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా అంతకుముందు రోజు ముగింపు ధరతో పోలిస్తే దాదాపు రూ.1,160 తగ్గింది. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ ధరల తగ్గుదల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ రిటర్న్ ప్రకారం.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్, ముంబైలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,130 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,14,700 గా ఉంది. ఢిల్లీ,లక్నోలలో 24 క్యారెట్ల ధర రూ. 1,25,280 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,14,850 ఉంది. అత్యధికంగా చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ. 1,25,670 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,15,200 గా నమోదైంది. అలాగే, కోల్‌కతాలో ముంబై, హైదరాబాద్ రేట్లే కొనసాగుతుండగా, అహ్మదాబాద్, పాట్నాలలో 24 క్యారెట్ల ధర రూ.1,25,180 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,14,750 వద్ద ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరట. మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం, ధరలు తగ్గడం వలన పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల తగ్గుదలను పెట్టుబడిదారులు, సాధారణ వినియోగదారులు కొనుగోలుకు మంచి అవకాశంగా భావించవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

