మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..  తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు (Gold Prices) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరి 10వ తేదీ శనివారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,890గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,150గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.58,040గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,300గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,890గాఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,150గా ఉంది.

ఇక, వెండి ధరలు విషయానికి వస్తే.. ఇవాళ కేజీ వెండి రూ.100 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.76 వేల 600గా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75 వేల 100గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story