శామ్‌సంగ్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరిక

శామ్‌సంగ్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరిక
భారత ప్రభుత్వం ఈ వారంలో అదనపు భద్రతా హెచ్చరికలను జారీ చేసింది.

భారత ప్రభుత్వం ఈ వారంలో అదనపు భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ప్రత్యేకంగా Samsung Galaxy ఫోన్‌ల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుండి వచ్చిన నివేదిక ప్రకారం పాత మరియు కొత్త మోడల్‌లను లక్ష్యంగా చేసుకుంది.

డిసెంబర్ 13న జారీ చేయబడిన, భద్రతా హెచ్చరిక ఆందోళనను హై-రిస్క్‌గా వర్గీకరిస్తుంది, ఇప్పటికే ఉన్న Samsung వినియోగదారులు తమ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను తక్షణమే అప్‌డేట్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. "Samsung ఉత్పత్తులు భద్రతా పరిమితులను అతిక్రమిస్తున్నాయి. ఇవి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు అని CERT పేర్కొంది. నివేదిక ప్రకారం, ఈ ముప్పుకు గురయ్యే సాఫ్ట్‌వేర్‌లో Samsung మొబైల్ Android వెర్షన్‌లు 11, 12, 13 మరియు 14 ఉన్నాయి.

Samsung స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సూచనలు:

Samsung Galaxy ఫోన్‌ల వినియోగదారులు సాప్ట్ వేర్ ను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించారు. అలా చేయడంలో విఫలమైతే శామ్‌సంగ్ మోడల్‌లు హ్యాకర్ల నుండి బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంది. సిస్టమ్ అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేయడం వలన హ్యాకర్‌లు సున్నితమైన డేటాకు అనధికారిక యాక్సెస్‌ను పొందే అవకాశాన్ని అందించినట్లవుతుంది. Samsung ఈ బెదిరింపులకు పరిష్కారాన్ని విడుదల చేసింది. వినియోగదారులు వీలైనంత త్వరగా తమ సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story