GST 2.0 : కొత్త జీఎస్టీ రేట్లు వచ్చేశాయి.. ఏవి చౌక, ఏవి ఖరీదైనవో తెలుసా?

GST 2.0 : కొత్త జీఎస్టీ రేట్లు వచ్చేశాయి.. ఏవి చౌక, ఏవి ఖరీదైనవో తెలుసా?
X

GST 2.0 : జీఎస్టీ వ్యవస్థలో కొత్త మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అంటే నేటి నుంచి కొత్త జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లను రెండు ప్రధాన స్లాబ్‌లకు తగ్గించారు. ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా, మరికొన్నింటి ధరలు పెరగనున్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి, ఏవి పెరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 22 నుంచి భారతదేశంలో కొత్త జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వస్తుంది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌లను ఇప్పుడు 5%, 18% అనే రెండు ప్రధాన స్లాబ్‌లుగా మార్చారు. వీటితో పాటు, లగ్జరీ, హానికరమైన వస్తువులకు ప్రత్యేకంగా 40% పన్ను కూడా విధించారు. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు చాలా వరకు ఉపశమనం లభించనుంది.

ఏ వస్తువుల ధరలు తగ్గాయి? కొత్త జీఎస్టీ విధానం ప్రకారం, చాలా గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయి. గతంలో 12%, 28% స్లాబ్‌లలో ఉన్న వస్తువులను ఇప్పుడు 5%, 18% స్లాబ్‌లకు మార్చారు.

5% జీఎస్టీ స్లాబ్‌లోకి మారినవి గతంలో 12% స్లాబ్‌లో ఉన్న టూత్‌పేస్ట్, సబ్బులు, షాంపూ, బిస్కెట్లు, జ్యూస్, నెయ్యి, సైకిళ్లు, స్టేషనరీ, బట్టలు, చెప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. వీటి ధరలు దాదాపు 7% నుంచి 8% వరకు తగ్గవచ్చు.

18% జీఎస్టీ స్లాబ్‌లోకి మారినవి: గతంలో 28% స్లాబ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గుతాయి. ఏసీ, ఫ్రిడ్జ్, డిష్‌వాషర్, పెద్ద స్క్రీన్ టీవీలు, సిమెంట్, చిన్న కార్లు, టూ వీలర్స్ వంటి వస్తువుల జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. వీటి ధరలు కూడా 7% నుంచి 8% వరకు తగ్గవచ్చు.

తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై గతంలో 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా చౌకగా మారనున్నాయి. కొన్నింటికి పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు.

ఏ వస్తువుల ధరలు పెరిగాయి?

కొన్ని వస్తువులు, సేవలను ప్రత్యేకంగా 40% పన్ను స్లాబ్‌లోకి చేర్చారు.

* పొగాకు ఉత్పత్తులు: సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా వంటి ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై 40% పన్ను విధించారు.

* ఆన్‌లైన్ సేవలు: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఇతర వ్యసనాలకు సంబంధించిన సేవలపై కూడా 40% పన్ను వర్తిస్తుంది.

* విలాసవంతమైన వస్తువులు: వజ్రాలు, పగడాలు వంటి విలాసవంతమైన వస్తువులపై కూడా పన్ను పెరిగింది.

Tags

Next Story