HAL Loses : దుబాయ్‌లో తేజస్ విమానం క్రాష్..ప్రభుత్వ కంపెనీకి రూ.26వేల కోట్ల నష్టం.

HAL Loses : దుబాయ్‌లో తేజస్ విమానం క్రాష్..ప్రభుత్వ కంపెనీకి రూ.26వేల కోట్ల నష్టం.
X

HAL Loses : దుబాయ్‌లో తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం అనేది దాన్ని తయారు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‎కు భారీ నష్టాన్ని కలిగించింది. ఈ ఘటన కారణంగా సోమవారం నవంబర్ 24న కంపెనీ షేర్ల విలువ సుమారు 8.50 శాతం భారీ తగ్గుదలతో ఓపెన్ అయింది. గత 6 నెలల్లో కంపెనీ షేర్లలో 11 శాతానికి పైగా పతనం కనిపించింది. ఈ ప్రమాదం కారణంగా భారత్ రక్షణ ఎగుమతులకు కూడా తాత్కాలికంగా ఎదురుదెబ్బ తగలవచ్చనే భావన కారణంగానే HAL షేర్లు పడిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.

సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‎లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లలో భారీ పతనం కనిపించింది. కంపెనీ షేరు 8.50 శాతం నష్టంతో రూ. 4,205.25 వద్ద ఓపెన్ అయింది. ఇదే ఆ రోజు కనిష్ట స్థాయి కూడా. శుక్రవారం కంపెనీ షేరు రూ. 4,595 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజు పతనం కారణంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.26,065.5 కోట్లు తగ్గింది. శుక్రవారం రూ.3,07,302.10 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ, సోమవారం మార్కెట్ ఓపెన్ కాగానే రూ. 2,81,236.60 కోట్లకు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి, కంపెనీ షేరు సుమారు 3.50 శాతం నష్టంతో రూ. 4,436.10 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది.

ఈ షేర్ పతనంపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెంట్ర్‌మ్ బ్రోకింగ్ నిపుణుడు నిలేష్ జైన్ మాట్లాడుతూ.. తేజస్ క్రాష్ వార్త మార్కెట్‌లో సెంటిమెంటల్ ఇంపాక్ట్ మాత్రమే చూపిందని, ఇది మంటల్లో ఆజ్యం పోసినట్లుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, వేల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా మాట్లాడుతూ.. గత రెండు నెలల నుంచి షేర్లలో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, HAL ట్రెండ్ స్థిరంగా కనిపిస్తోందని చెప్పారు. ఆయన ప్రకారం, HAL షేర్లకు రూ. 4,350 వద్ద బలమైన సపోర్టు, రూ. 5,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అందుకే, ఆయన సపోర్ట్ లెవల్ వద్ద కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు, భవిష్యత్తులో లిమిటెడ్ రేంజ్ లో పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు.

Tags

Next Story