Home
 / 
బిజినెస్ / Job Circular: కరోనా...

Job Circular: కరోనా బ్యాచ్ అనర్హులు..! వైరల్

HDFC Bank Job Circular: కరోనా లాక్‎డౌన్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విద్యార్థులను పాస్ చేసినట్లు ప్రకటించాయి.

Job Circular: కరోనా బ్యాచ్ అనర్హులు..! వైరల్
X

HDFC Bank Job Circular: కరోనా లాక్‎డౌన్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విద్యార్థులను నిబంధనల మేరా పాస్ చేసినట్లు ప్రకటించాయి. అయితే సోషల్ మీడియాలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ జాబ్ సర్కులర్ వైరల్ అయింది. ఆ బ్యాంక్ ఇచ్చిన నొటిఫికేషన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ బ్యాంకు ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలో ఏముందంటే.. డిగ్రీ క్వాలిఫికేషన్ తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది HDFC బ్యాంకు.

అయితే 2021లో పాసైన అభ్యర్థులు అనర్హులంటూ(2021 Passout Batch Not Eligible ) అందులో పేర్కొన్నారు. కరోనా కారణంగా 2021లో పరీక్షలు రాయకుండా ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని నెటిజన్లు భావించారు. దాంతో జాబ్ సర్కులర్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్ గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని వాపోతున్నారు.

ఆ ఉద్యోగ ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున వివాదానికి దారి తీయడంతో HDFC బ్యాంక్ యాజమాన్యం స్పందించింది. అది అక్షర దోషం అని వివరణ ఇచ్చింది. సర్కులర్ లో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తేల్చిచెప్పింది. 2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కరెక్షన్ చేసిన సర్కులర్ ని మళ్లీ షేర్ చేసినట్టు బ్యాంకు తెలిపింది.Next Story