HDFC Bank : కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పేరు తెచ్చుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) తాజాగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవలే లోన్ వడ్డీ రేట్లు పెంచి షాక్ ఇచ్చిన ఆ బ్యాంకు.. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచి కాస్త ఊరట కల్పించింది. ఇది ఫిబ్రవరి 9నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
వడ్డీ రేట్లు సవరించిన తర్వాత ప్రస్తుతం ఈ బ్యాంకు వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై కనిష్టంగా రెగ్యులర్ సిటిజెన్లకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకు.. అదే సీనియర్ సిటిజెన్లకు మాత్రం 3.50 శాతం నుంచి గరిష్టంగా 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 18 నెలల నుంచి 21 నెలల వ్యవధి డిపాజిట్‌పై ఇప్పుడు బ్యాంక్ వడ్డీ రేట్లను 7 శాతం నుంచి 7.25 శాతానికి చేర్చింది.
ఇక ఈ బ్యాంకు అత్యధికంగా 18 నెలల నుంచి 21 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది. 15 నుంచి 18 నెలల వ్యవధి డిపాజిట్లపై వరుసగా 7.10 శాతం, 7.60 శాతం వడ్డీ వస్తుంది. రెండేళ్ల 11 నెలల నుంచి 35 నెలల వ్యవధి డిపాజిట్లపై 7.15 శాతం, 7.65 శాతం చొప్పున వడ్డీ అందుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com