Hero Vida : పిల్లల కోసం హైటెక్ బైక్.. హీరో విడా నుంచి డర్ట్.ఇ K3 విడుదల.

Hero Vida : దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ డర్ట్.ఇ K3ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.69,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు, ఈ ధర మొదటి 300 మంది కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ బైక్ ముఖ్యంగా 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు సురక్షితంగా డర్ట్ బైకింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసుకోవడానికి వీలుగా రూపొందించబడింది. ఈ మోడల్‌ను అంతర్జాతీయ మోటార్ షో EICMA 2025 లో మొదటిసారి ప్రదర్శించారు.
డర్ట్.ఇ K3 ప్రధాన ఆకర్షణ దాని అడ్జస్టబుల్ ఛాసిస్. ఈ ఫీచర్ సహాయంతో పిల్లల అవసరాలకు అనుగుణంగా వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ ఎత్తు, రైడింగ్ ఎత్తును మార్చుకోవచ్చు. ఇందులో స్మాల్, మీడియం, లార్జ్ అనే మూడు వేర్వేరు సెట్టింగ్‌లు ఇవ్వబడ్డాయి. స్మాల్ మోడ్‌లో సీటు ఎత్తు 454 మిమీ, మీడియంలో 544 మిమీ, లార్జ్‌లో 631 మిమీ వరకు సర్దుబాటు చేయవచ్చు. ఈ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, బైక్ బరువు కేవలం 22 కిలోలు మాత్రమే ఉండటం విశేషం.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఈ-బైక్‌లో అనేక ముఖ్యమైన ఫీచర్లు చేర్చారు. నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా తొలగించదగిన ఫుట్‌పెగ్‌లు., ప్రమాదం జరిగినప్పుడు గాయాన్ని తగ్గించడానికి హ్యాండిల్‌బార్‌పై చెస్ట్ ప్యాడ్, మ్యాగ్నెటిక్ కిల్ స్విచ్ (ఇది లాగితే బైక్ వెంటనే ఆగిపోతుంది).వెనుక మోటారు కవర్. స్టాండర్డ్ బ్రేక్‌లతో పాటు, పెద్ద వీల్స్, ఫ్రంట్, రియర్ సస్పెన్షన్స్ వంటి ఫీచర్లు యాక్సెసరీలుగా అదనంగా లభిస్తాయి.
డర్ట్.ఇ K3 లో 500W ఎలక్ట్రిక్ మోటారు, 360Wh తొలగించగల లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది సుమారు 2-3 గంటల పాటు నిరంతర రైడింగ్ అనుభవాన్ని ఇవ్వగలదు. పిల్లలు నెమ్మదిగా, ఆత్మవిశ్వాసంతో బైక్ నడపడం నేర్చుకోవడానికి, ఇందులో లో, మిడ్, హై అనే మూడు వేర్వేరు స్పీడ్ లిమిట్ ఉన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ బైక్ చిన్న ట్రైనింగ్ సెషన్స్‌కు, ప్రారంభ ఆఫ్-రోడ్ రైడింగ్ అనుభవానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
విడా డర్ట్.ఇ K3 ని ఒక కనెక్టెడ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. దీని ద్వారా తల్లిదండ్రులు కారు స్పీడ్ లిమిట్‌ను నిర్ణయించవచ్చు, యాక్సిలరేషన్ ప్రతిస్పందనను నియంత్రించవచ్చు. రైడింగ్‌కు సంబంధించిన డేటాను ట్రాక్ చేయవచ్చు. ఈ మోడల్ తన ఎర్గోనామిక్, మాడ్యులర్ డిజైన్ కారణంగా రెడ్ డాట్ అవార్డ్ తో సహా అనేక అంతర్జాతీయ డిజైన్ అవార్డులను కూడా గెలుచుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

