Home Loan : ఐదేళ్లలో హోమ్ లోన్ మార్కెట్ రెట్టింపు

Home Loan : ఐదేళ్లలో హోమ్ లోన్ మార్కెట్ రెట్టింపు
X

రానున్న ఐదు సంవత్సరాల్లో గృహ రుణాల మార్కెట్ రెట్టింపు అవుతుందని హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ నొమురా తెలిపింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలిపింది. పెరుగుతున్న జనాభా, వారికి సరిపడినన్ని ఇళ్ల నిర్మాణానికి ఉన్న డిమాండ్, ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రజల ఆర్థిక స్థితి పెరుగుతుందడం వంటి కారణాలతో గృహ పరిశ్రమ వృద్ధి చెందుతుందని నొమురా అంచనా వేసింది.

దేశంలో వ్యక్తిగత ఇంటి రుణాలు గత దశాబ్దంలో 15 శాతం సీఏజీఆర్ వృద్ధిని నమోదు చేశాయి. ఇవి 2023 సెప్టెంబర్ నాటికి విలువ పరంగా 30 లక్షలకోట్లుగా ఉన్నాయి. గత దశాబ్దంలో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ, భారత్లో ఇంటి రుణాల వ్యాప్తి తక్కువగానే ఉంది. 2023 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్ లు వ్యక్తిగత గృహ రుణాలతో కలిపి 41 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్లు 38 శాతం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 18 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయని తెలిపింది.

Tags

Next Story