Honda : సరికొత్త క్లాసిక్ లుక్‌తో హోండా CB1000F బైక్ రిలీజ్.. అదిరే ఫీచర్లు.

Honda : కొన్ని నెలల కిందట ఒక కాన్సెప్ట్‌గా చూపించిన హోండా CB1000F బైక్‌ను హోండా సంస్థ ఇప్పుడు అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఇప్పటికే ఉన్న CB1000 హార్నెట్ బైక్ తయారైన ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందించినా, దీనికి క్లాసిక్ లుక్ ఇచ్చారు. అంతేకాకుండా దీని ఇంజిన్, ఇతర భాగాలను ప్రత్యేకంగా మార్పులు చేసి, రైడింగ్ ఎక్స్ పీరియన్స్ వేరుగా ఉండేలా తీర్చిదిద్దారు. హోండా CB1000F బైక్‌లో 1000 సీసీ కెపాసిటీ గల 4-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ను 2017లో వచ్చిన CBR1000RR ఫైర్‌బ్లేడ్ బైక్ నుండి తీసుకున్నారు. అయితే, హోండా సంస్థ ఇందులో అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా ఇంజిన్ కామ్‌షాఫ్ట్, ఎయిర్‌బాక్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను రీ డిజైన్ చేశారు.
ఈ ఇంజిన్ 123.7 హార్స్‌పవర్ ఎనర్జీని, 103 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CB1000 హార్నెట్‌తో పోలిస్తే కొంచెం తక్కువ శక్తిని ఇచ్చినా, తక్కువ ఆర్‌పీఎం వద్దే ఎక్కువ శక్తి లభిస్తుంది. దీనివల్ల బైక్ పట్టణాలలో, హైవేలపై మరింత సౌకర్యంగా నడుస్తుంది. గేర్ రేషియోలను కూడా మార్చారు. మొదటి రెండు గేర్‌లు చిన్నవిగా, మిగిలినవి పొడవుగా ఉంచడం వల్ల పర్పామెన్స్ బ్యాలెన్సుడ్ గా ఉంటుంది.
CB1000F బైక్ ఫ్రేమ్, హార్నెట్ బైక్ మాదిరిగానే ఉన్నా, దీనికి కొత్త సబ్‌ఫ్రేమ్ డిజైన్ ఇచ్చారు. సీటు ఎత్తు 795 మిల్లీమీటర్లు ఉంటుంది, ఇది హార్నెట్ కన్నా కొంచెం తక్కువ. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 16 లీటర్లు. ఈ బైక్ బరువు 214 కిలోలు, ఇది హార్నెట్ బైక్ కంటే 2 కిలోలు ఎక్కువ. సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో షోవా సంస్థ తయారుచేసిన అడ్జస్ట్ చేయగల సస్పెన్షన్ వాడారు. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో నిస్సిన్ (Nissin) సంస్థకు చెందిన 310 మిల్లీమీటర్ల డ్యూయల్ డిస్క్‌లు, వెనుక భాగంలో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఇచ్చారు. టైర్ల పరిమాణం కూడా హార్నెట్ మాదిరిగానే ఉంది.
బయటికి పాత లుక్‌లో ఉన్నప్పటికీ ఈ బైక్‌లో లేటెస్ట్ టెక్నాలజీ నిండి ఉంది. ఇందులో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, పూర్తి ఎల్‌ఈడీ లైట్లు, కీ-లెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్‌ను సులభతరం చేయడానికి ఇందులో మూడు ముందుగా సెట్ చేసిన రైడింగ్ విధానాలు (స్పోర్ట్, స్టాండర్డ్, రైన్) , ఇంజిన్ శక్తి, ఇంజిన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్‌ను మనం సర్దుబాటు చేసుకునేందుకు రెండు కస్టమ్ యూజర్ విధానాలు కూడా ఉన్నాయి. ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా లభిస్తుంది, కానీ దాన్ని ఆపడానికి వీలు లేదు.
హోండా CB1000F బైక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సిల్వర్/బ్లూ, బ్లాక్/రెడ్. దీని ధరను ఐరోపాలో ఇంకా ప్రకటించలేదు. కానీ జపాన్‌లో దీని ధర 13,97,000 యెన్ (సుమారు రూ.8.11 లక్షలు)గా నిర్ణయించారు. ఇది CB1000 హార్నెట్ బైక్ కంటే కొంచెం ఎక్కువ ధర. ఈ బైక్ ప్రపంచవ్యాప్త విడుదల, ఇతర వివరాలు నవంబర్‌లో జరగబోయే EICMA 2025 మోటార్‌సైకిల్ ప్రదర్శనలో తెలియనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com