Honda Elevate : హోండా ఎలివేట్‌పై ఊహించని డిస్కౌంట్..ఏకంగా రూ.1.76 వేలు ఆదా చేసుకోండి.

Honda Elevate : డిసెంబర్ 2025 ప్రారంభం కావడంతో హోండా కార్స్ ఇండియా తమ కస్టమర్లకు ఈ ఏడాది చివర్లో పెద్ద బహుమతి ఇచ్చింది. కంపెనీ తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన హోండా ఎలివేట్ పై ఇప్పటివరకు ఎప్పుడూ ఇవ్వనంత భారీ ఇయర్-ఎండ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెలలో ఎలివేట్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా రూ.1.76 లక్షల వరకు భారీ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ద్వారా కారు కొనుగోలు చేసేవారికి డబ్బు ఆదాతో పాటు, అదిరిపోయే ఫీచర్ ప్యాక్ కూడా ఉచితంగా దక్కనుంది.
ఈ భారీ డిస్కౌంట్‌తో పాటు, హోండా కంపెనీ ఎలివేట్ మోడల్ కోసం ప్రత్యేకంగా ఎలైట్ ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌ను కస్టమర్‌లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్యాక్‌లో 360° కెమెరా, 7-కలర్ యాంబియెంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.10.99 లక్షల నుంచి మొదలవుతాయి. భారత మార్కెట్లో ఈ కారు మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ఫేమస్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ల సామర్థ్యం ఉన్న VTEC పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 121 PS పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ పర్ఫామెన్స్ నగరంలో, హైవేపై కూడా చాలా మృదువుగా, సమర్థవంతంగా ఉంటుంది.
హోండా ఎలివేట్ అనేక ఫీచర్లతో వివిధ వేరియంట్లలో (SV, V, VX, ZX) అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ ZX వేరియంట్‌లో అత్యంత కీలకమైన హోండా సెన్సింగ్ టెక్నాలజీతో కూడిన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి, ఇది భద్రత పరంగా ఈ కారుకు మంచి రేటింగ్ దక్కేలా చేస్తుంది.
టాప్ వేరియంట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్రౌన్ లెదర్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్ వంటివి ఉన్నాయి. ఇతర వేరియంట్లలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, సింగిల్-పాన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, లెన్ వాచ్ కెమెరా, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎలివేట్ మొత్తం 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటిలో 7 మోనో-టోన్, 3 డ్యుయల్-టోన్ ఆప్షన్లు ఉన్నాయి. డ్యుయల్-టోన్ మోడల్స్‌కు నలుపు రంగు రూఫ్ ఉండటం వల్ల, కారుకు మరింత ప్రీమియం లుక్ వస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

