HONDA: హోండా రెబల్ 500 భారత్‌లో లాంచ్

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశీయ మార్కెట్లోకి కొత్త ప్రీమియం మోడల్‌ను తీసుకొచ్చింది. ‘‘హోండా రెబల్ 500’’ పేరుతో ఈ క్రూజర్ బైక్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ మోడల్ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
జూన్ నుంచి డెలివరీలు
రెబల్ 500 బుకింగ్‌లు ఇప్పటికే గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు నగరాల్లోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభమయ్యాయి. జూన్ 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఆకర్షణీయమైన బోబర్ స్టైల్
ఈ మోటార్‌సైకిల్ ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్, బాబర్ స్టైల్ ఫ్లాట్ టైర్లు, ఎల్‌ఈడీ లైటింగ్, సిగ్నేచర్ రౌండ్ హెడ్‌ల్యాంప్ వంటి డిజైన్ ఫీచర్లతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫ్యాషన్, ఫంక్షనాలిటీ రెండింటినీ సమతుల్యంగా మిళితం చేస్తూ, ఇది యువరైడర్లను ఆకట్టుకునేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com