Honda : హోండా నుంచి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌

Honda : హోండా నుంచి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌
X

‘హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’ ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. సీబీ300ఎఫ్​పేరిట ఆవిష్కరించింది. దేశంలోనే తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ మోటార్‌ సైకిల్‌ ఇది. ప్రారంభ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. స్పోర్ట్స్‌ రెడ్‌, మ్యాట్‌ యాక్సిస్ గ్రే మెటాలిక్‌ రంగుల్లో లభిస్తుంది. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయొల్ బైక్‌ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్‌ చివరి వారం నుంచి హోండా బిగ్‌వింగ్‌డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 293.52సీసీ, 4 స్ట్రోక్‌, సింగిల్‌ సిలిండర్‌ పీజీఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో తీసుకొచ్చారు. ఇది 18.3 కెడబ్ల్యూ శక్తిని, 25.9 టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, అసిస్టెంట్‌ స్లిప్‌ క్లచ్‌తో వస్తోంది. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌తో దీన్ని తీసుకొచ్చారు.

Tags

Next Story