Honda : షైన్, యాక్టివా జోరు..అమ్మకాల్లో హోండా ఊచకోత!

Honda : షైన్, యాక్టివా జోరు..అమ్మకాల్లో హోండా ఊచకోత!
X

Honda : హోండా కంపెనీకి 2025 డిసెంబర్ నెల కాసుల వర్షం కురిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 45 శాతం వృద్ధితో హోండా దూసుకుపోతోంది. డిసెంబర్ 2024లో కేవలం 2.71 లక్షల యూనిట్లు అమ్మిన హోండా, 2025 డిసెంబర్ నాటికి ఆ సంఖ్యను ఏకంగా 3.92 లక్షల యూనిట్లకు చేర్చింది. అంటే కేవలం ఒక నెలలోనే సుమారు 1.21 లక్షల అదనపు వాహనాలను విక్రయించి తన సత్తా చాటింది. ముఖ్యంగా యాక్టివా స్కూటర్లు, షైన్ బైకుల కోసం కస్టమర్లు షోరూమ్‌ల వద్ద క్యూ కట్టడం విశేషం.

హోండా విజయంలో ఎప్పటిలాగే యాక్టివా అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన స్కూటర్‌గా యాక్టివా తన పట్టును మరింత బిగించింది. అటు మోటార్‌సైకిల్ విభాగంలో హోండా షైన్, ఎస్పీ 125 బైకులు విపరీతమైన డిమాండ్‌ను సంపాదించుకున్నాయి. 125 సీసీ సెగ్మెంట్‌లో హోండా షైన్ తిరుగులేని విజేతగా నిలవగా, యూత్ ఎక్కువగా ఇష్టపడే హోండా డియో స్కూటర్లు కూడా అమ్మకాల్లో దుమ్మురేపాయి.

హోండా మొత్తం అమ్మకాల్లో స్కూటర్ల వాటా చాలా ఎక్కువగా ఉంది. నగరాల్లో ట్రాఫిక్ పెరగడం, నడపడం సులభంగా ఉండటంతో టైర్-1 నగరాల్లో యాక్టివా, డియోలకు డిమాండ్ భారీగా పెరిగింది. కేవలం సిటీల్లోనే కాకుండా పల్లెటూళ్లలో కూడా హోండా వాహనాలపై ఉన్న నమ్మకం అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. ఆటోమేటిక్ స్కూటర్ల విభాగంలో హోండాను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

కేవలం మధ్యతరగతి బైకులే కాకుండా, హోండా అందిస్తున్న ప్రీమియం సెగ్మెంట్ CB350 రేంజ్ బైకులు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. క్లాసిక్ లుక్ ఇష్టపడే యువత ఈ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అటు సామాన్యుల నుండి ఇటు రాయల్ లుక్ కోరుకునే వారి వరకు అందరినీ హోండా తన బుట్టలో వేసుకుంది. 45 శాతం వార్షిక వృద్ధితో ఫుల్ జోష్‌లో ఉన్న హోండా, 2026లో మరిన్ని కొత్త మోడళ్లను లాంచ్ చేసి మార్కెట్ లీడర్‌గా నిలవాలని ప్లాన్ చేస్తోంది.

Tags

Next Story