Honda : హోండా కార్లపై డిస్కౌంట్ల వర్షం.. ఏకంగా రూ.1.97 లక్షల వరకు లాభం.

Honda : హోండా కార్లపై డిస్కౌంట్ల వర్షం.. ఏకంగా రూ.1.97 లక్షల వరకు లాభం.
X

Honda : కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వారికి హోండా కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 2026 నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఇష్టమైన హోండా అమేజ్ నుంచి లగ్జరీ హోండా సిటీ వరకు దాదాపు అన్ని మోడల్స్‌పై లక్షల్లో లాభం పొందే అవకాశం కల్పిస్తోంది. ఒకవైపు కొత్త కార్లు లాంచ్ చేస్తున్నా, పాత స్టాక్, సేల్స్ పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. హోండా లైనప్‌లో అత్యంత చౌకైన కారు అమేజ్. ప్రస్తుతం మార్కెట్లో 3వ జనరేషన్ అమేజ్ (ధర రూ.7.48 లక్షలు) ఉన్నప్పటికీ, కంపెనీ ఇంకా 2వ జనరేషన్ అమేజ్‌ను కూడా అమ్ముతోంది. ఈ ఫిబ్రవరిలో 3వ జనరేషన్ అమేజ్‌పై రూ.57,000 వరకు ప్రయోజనాలు ఉండగా, 2వ జనరేషన్ మోడల్‌పై ఏకంగా రూ.68,000 వరకు తగ్గింపు లభిస్తోంది. మారుతి డిజైర్‌కు గట్టి పోటీనిచ్చే ఈ కారు ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తుండటంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

హోండా నుంచి వచ్చిన పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్ పై ఈ నెలలో రూ.1.48 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక సెడాన్ ప్రేమికుల ఆల్-టైమ్ ఫేవరెట్ హోండా సిటీ విషయానికి వస్తే..

సిటీ పెట్రోల్: దీనిపై రూ. 1.28 లక్షల వరకు లాభం పొందవచ్చు.

సిటీ హైబ్రిడ్: ఈ మోడల్‌పై అత్యధికంగా రూ.1.97 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. సాధారణ వెర్షన్ కంటే హైబ్రిడ్ మోడల్ ధర సుమారు రూ.4 లక్షలు ఎక్కువగా ఉండటంతో, కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ఈ భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

కేవలం డిస్కౌంట్లే కాకుండా, రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవాలని హోండా ప్లాన్ చేస్తోంది. 2030 నాటికి దేశంలో 10 కొత్త మోడల్స్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 7 మోడల్స్ ఎస్‌యూవీలే కావడం విశేషం. పెట్రోల్/డీజిల్ ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా హోండా సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా భారత్ నుంచి ఎగుమతులను పెంచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

గమనిక: ఈ డిస్కౌంట్లు నగరం, డీలర్, స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలోని హోండా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

Tags

Next Story