Tata Punch EV : టాటా పంచ్ ఈవీపై భారీ ఆఫర్.. ఏకంగా రూ. 1.20 లక్షల డిస్కౌంట్.

Tata Punch EV : భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, తన కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం. టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పంచ్ ఈవీ పై ఏకంగా రూ.1.20 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు మరికొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ అనేది మీరు ఉండే నగరం మరియు డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది, కాబట్టి షోరూమ్‌కు వెళ్లేముందు ఒకసారి వివరాలు కనుక్కోవడం మంచిది.
రేంజ్ విషయంలో తగ్గేదే లే
టాటా పంచ్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. మొదటిది 25 kWh బ్యాటరీ వెర్షన్. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 315 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సిటీలో తిరగడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక రెండోది భారీ బ్యాటరీ కలిగిన 35 kWh వెర్షన్. ఇది ఏకంగా 421 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. అంటే ఊర్లకు వెళ్లాలన్నా, లాంగ్ జర్నీలు చేయాలన్నా ఈ కారు మీకు పక్కాగా సెట్ అవుతుంది. పవర్ విషయంలో కూడా ఇది చాలా పవర్‌ఫుల్.. కేవలం కొద్ది సెకన్లలోనే మంచి వేగాన్ని అందుకుంటుంది.
హైటెక్ ఫీచర్ల ఖజానా
కేవలం రేంజ్ మాత్రమే కాదు, ఈ కారులో ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. లోపల 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం సన్‌రూఫ్, కేబిన్ లోపల గాలిని శుభ్రంగా ఉంచేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా 360 డిగ్రీల కెమెరా ఉండటం వల్ల ఇరుకైన సందుల్లో కూడా కారును చాలా ఈజీగా పార్క్ చేయవచ్చు.
సేఫ్టీలో టాప్ క్లాస్
టాటా కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. పంచ్ ఈవీలో కూడా కంపెనీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఇస్తున్న రూ.1.20 లక్షల తగ్గింపును లెక్కలోకి తీసుకుంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది ఒక అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
