Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనే ప్లానా? టాప్ మోడల్ వద్దు..రూ.లక్షలు ఆదా చేసే మోడల్ ఇదే.

Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనే ప్లానా? టాప్ మోడల్ వద్దు..రూ.లక్షలు ఆదా చేసే మోడల్ ఇదే.
X

Hyundai Creta : హ్యుందాయ్ కంపెనీ 2025 మార్చిలో క్రెటా సిరీస్‌ను కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో కొత్త వేరియంట్‌లు, అదనపు ఫీచర్లను జోడించడం వల్ల టాప్ వేరియంట్‌ల ధరలు బాగా పెరిగాయి. అయితే క్రెటా సిరీసులో అత్యంత బ్యాలెన్సుడ్, వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ గా నిలిచిన మోడల్ S(O) వేరియంట్. దీని ధర ఇంజిన్, గేర్‌బాక్స్‌ను బట్టి సుమారు రూ.14 లక్షల నుంచి రూ.17.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ వేరియంట్ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ, అనవసరమైన ఖరీదైన ఫీచర్లను దూరం చేస్తుంది. తద్వారా కస్టమర్లు లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

క్రెటా S(O) వేరియంట్ ఆకర్షణకు ప్రధాన కారణం ఇందులో ఉన్న పూర్తి స్థాయి భద్రతా ఫీచర్లు. ఇందులో డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగులతో సహా 6 ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా లభిస్తాయి. అంతేకాకుండా ABS+EBD, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), VSM (వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్), హిల్-స్టార్ట్ అసిస్ట్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రేర్ డిస్క్ బ్రేకులు, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్ వంటివి కూడా ఈ వేరియంట్‌లో ఉండటం దీనిని సురక్షితమైన ఎంపికగా నిలుపుతుంది.

ఈ మోడల్ ఎక్స్‌టీరియర్ లుక్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో R17 బ్లాక్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, LED హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌లు, రూఫ్ రైల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి లభిస్తాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్, అలాగే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌లు, ఆటోమేటిక్ వేరియంట్లలో ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ కీ + పుష్ స్టార్ట్ వంటివి ఈ వేరియంట్ ప్రధాన ఆకర్షణలు. టెక్నాలజీ పరంగా ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా టాప్ మోడల్‌లలో వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం లెదర్ అప్హోల్‌స్ట్రీ లేదా మరింత మెరుగైన ఆడియో సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ ఫీచర్లు బాగున్నప్పటికీ రోజువారీ వినియోగంలో వాటి వల్ల కలిగే ప్రయోజనం అంత పెద్దది కాదు. పైగా టాప్ మోడల్‌లకు అధిక ప్రారంభ ధరతో పాటు, ఎక్కువ ఇన్సూరెన్స్, రిపేర్ ఖర్చులు కూడా ఉంటాయి. క్రెటా S(O) వేరియంట్, రోజువారీ అవసరాలకు కావాల్సిన అన్ని ముఖ్యమైన టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లను అందిస్తూ, అనవసరంగా ఖరీదైన ఫీచర్లను తొలగిస్తుంది. కాబట్టి డబ్బును ఆదా చేసుకోవాలని, అన్ని ముఖ్యమైన ఫీచర్లను పొందాలని కోరుకునే కస్టమర్‌లకు క్రెటా S(O) వేరియంట్ సరైన, తెలివైన ఎంపిక.

Tags

Next Story