Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై భారీ తగ్గింపు.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్ ఫీచర్లతో బెస్ట్ ఆఫర్.

Hyundai Exter : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. గత నెలలో రూ.50,000 డిస్కౌంట్ ఇవ్వగా, నవంబర్ నెలలో ఏకంగా రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. దీంతో వినియోగదారులకు అదనంగా రూ.20,000 లాభం లభించనుంది. హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో క్రెటా, వెన్యూ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ కారు ఈ ఎక్స్‌టరే కావడం గమనార్హం. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,68,033.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీపై ఈ నెలలో కంపెనీ రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, పాత కారు స్క్రాపేజ్, కార్పొరేట్/రూరల్ డిస్కౌంట్లు ఉన్నాయి. గత నెల (అక్టోబర్) లో ఈ మోడల్‌పై రూ.50,000 డిస్కౌంట్ మాత్రమే లభించగా, ఈ నెలలో అదనంగా రూ.20,000 ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్ (మాన్యువల్/ఏఎంటీ), 1.2 లీటర్ సీఎన్‌జీ (మాన్యువల్) ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. భద్రతా విషయంలో ఇది మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, సెంట్రల్ లాకింగ్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ప్రామాణికంగా లభిస్తాయి.
వేరియంట్ల వారీగా ముఖ్య ఫీచర్లు
హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX నుంచి SX(O) కనెక్ట్ వరకు మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
S వేరియంట్: 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, ఫోర్ స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ AC వెంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్.
SX వేరియంట్: S ఫీచర్లతో పాటు, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ డిఫాగర్, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ (పెట్రోల్ మోడల్‌లలో).
SX (O) వేరియంట్: SX ఫీచర్లకు అదనంగా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, స్మార్ట్ కీ (కీలెస్ ఎంట్రీ/గో), వైర్‌లెస్ ఛార్జర్, లెదర్-వార్ప్డ్ స్టీరింగ్ వీల్.
SX (O) కనెక్ట్ వేరియంట్ (టాప్): ఇందులో డాష్‌క్యామ్, బ్లూలింక్ కనెక్టివిటీ, అలెగ్జాతో హోమ్ టు కార్ లింక్, OTA మ్యాప్ అప్‌డేట్లు వంటి అదనపు టెక్నాలజీ ఫీచర్లు లభిస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

