Hyundai Grand i10 NIOS : మారుతి స్విఫ్ట్‌కు గట్టి పోటీ.. అదిరిపోయే ఫీచర్లతో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్.

Hyundai Grand i10 NIOS : హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ i10 నియోస్‌లో సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వైబ్ ఎడిషన్ పేరుతో వచ్చిన ఈ మోడల్, స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సాధారణ మోడల్ కంటే భిన్నంగా, మరింత ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం ఈ స్పెషల్ వేరియంట్‌ను హ్యుందాయ్ డిజైన్ చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్ చూడటానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఎక్కడా లేని విధంగా టైటాన్ గ్రే మ్యాట్ పెయింట్ ఆప్షన్‌ను హ్యుందాయ్ పరిచయం చేసింది. కారు లోపల అంతా బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు అక్కడక్కడా రెడ్ ఫినిషింగ్ ఉండటంతో కారు చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. 15-అంగుళాల బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, లెదర్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ వంటివి ఈ కారు అందాన్ని రెట్టింపు చేశాయి.
ఈ కారులోని అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఏదైనా ఉందంటే అది దాని డ్యాష్ క్యామ్. పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా హ్యుందాయ్ ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఇది కేవలం డ్రైవింగ్‌ను రికార్డ్ చేయడమే కాకుండా.. ఎమర్జెన్సీ, ఈవెంట్, వెకేషన్ వంటి వేర్వేరు మోడ్లలో వీడియోలను తీయగలదు. అంతేకాదు ఫోటోలు తీసుకోవచ్చు, మొబైల్ యాప్ ద్వారా వీడియోలను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వస్తున్నాయి.
మెకానికల్ గా చూస్తే, వైబ్ ఎడిషన్ లో పెద్దగా మార్పులు లేవు. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 83 hp పవర్‌ను, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజీ కోరుకునే వారి కోసం సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది, అయితే ఇందులో పవర్ కొద్దిగా తక్కువగా (68 hp) ఉంటుంది. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండటంతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సదుపాయం కూడా ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.09 లక్షల నుంచి ప్రారంభమై రూ.7.73 లక్షల వరకు ఉంటుంది. ఇక సాధారణ గ్రాండ్ i10 నియోస్ బేస్ వేరియంట్ ధర రూ.5.55 లక్షల నుంచి మొదలవుతుంది. భారత మార్కెట్లో ఈ కారు నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో వంటి మోడళ్లతో పోటీ పడుతోంది. పండుగ సీజన్ కు ముందే హ్యుందాయ్ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకురావడం కస్టమర్లను ఆకట్టుకునే వ్యూహంగా కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
