Hyundai : హ్యుందాయ్ నుంచి కొత్త రచ్చ.. 2030 లోపు 26 కొత్త కార్లతో భారీ స్కెచ్.

Hyundai : హ్యుందాయ్ నుంచి కొత్త రచ్చ.. 2030 లోపు 26 కొత్త కార్లతో భారీ స్కెచ్.
X

Hyundai : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్, రాబోయే కొన్నేళ్ల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న ఈ కంపెనీ, 2030 నాటికి ఏకంగా 20 పెట్రోల్/డీజిల్ వాహనాలు, 6 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగానే హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన క్రెటా, ఐ20 కార్లను సరికొత్త హంగులతో రీ-లాంచ్ చేసేందుకు పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కొత్త మోడల్స్ టెస్టింగ్ దశలో ఉండగా, వీటి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హ్యుందాయ్ క్రెటా నెక్స్ట్ జనరేషన్

ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న క్రెటా, 2026లో సరికొత్త రూపంలో రాబోతోంది. కొత్త తరం క్రెటా ప్రస్తుత మోడల్ కంటే కాస్త పెద్దదిగా, మరింత స్టైలిష్‌గా ఉండనుంది. ఇది అధునాతన K3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతోంది. దీనివల్ల కారు లోపల స్థలం పెరగడమే కాకుండా, సేఫ్టీ రేటింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కియా సెల్టోస్ కొత్త మోడల్‌ను పోలి ఉంటుందని సమాచారం. ఇంజిన్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న 1.5L పెట్రోల్, 1.5L డీజిల్, 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించనున్నారు. అయితే, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైబ్రిడ్ వెర్షన్ ఈసారి క్రెటాలో పరిచయం కానుంది. దీనివల్ల మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.

హ్యుందాయ్ ఐ20 - న్యూ అవతార్

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ప్రీమియం లుక్ ఇచ్చే ఐ20 కారును కూడా హ్యుందాయ్ పూర్తిగా అప్‌డేట్ చేస్తోంది. 2027 నాటికి రాబోతున్న ఈ కొత్త ఐ20లో కాస్మెటిక్ మార్పులు ఎక్కువగా ఉండబోతున్నాయి. కొత్త తరం హ్యుందాయ్ మోడల్స్‌లో కనిపిస్తున్న మోడరన్ డిజైన్ లాంగ్వేజ్‎ను దీనికి అన్వయించనున్నారు. కారు లోపలి భాగంలో కొత్త డ్యాష్‌బోర్డ్, అదిరిపోయే సీటింగ్ మెటీరియల్స్, సరికొత్త టెక్నాలజీ ఫీచర్లు ఉండనున్నాయి. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో 360-డిగ్రీ కెమెరా, లెవల్ 1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి హై-ఎండ్ ఫీచర్లను జోడించబోతున్నారు. ఇంజిన్ పరంగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది.

హ్యుందాయ్ కేవలం పాత కార్లను అప్‌డేట్ చేయడమే కాకుండా, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా పెట్టుబడులు పెంచుతోంది. రాబోయే ఐదేళ్లలో మన రోడ్లపై హ్యుందాయ్ కొత్త కార్ల సందడి మామూలుగా ఉండదని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో హ్యుందాయ్ ఎప్పుడూ ముందే ఉంటుంది అనడానికి ఈ కొత్త లాంచింగ్సే నిదర్శనం.

Tags

Next Story