Upcoming Cars : టాటా పంచ్ కి హార్ట్ ఎటాక్ ఖాయం.. పోటీగా ముగ్గురు మొనగాళ్లు వస్తున్నారు.

Upcoming Cars : టాటా పంచ్ కి హార్ట్ ఎటాక్ ఖాయం.. పోటీగా ముగ్గురు మొనగాళ్లు వస్తున్నారు.
X

Upcoming Cars : భారతీయ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్, హ్యుందాయ్ మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్ కార్ల విషయంలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉండబోతోంది. వచ్చే ఏడాది (2026) హ్యుందాయ్ ఏకంగా మూడు కొత్త కార్లను బరిలోకి దింపుతోంది. రూ.5 లక్షల నుండి రూ.12 లక్షల లోపు ధరలోనే ఉండే ఈ కార్లు, టాటా పంచ్ వంటి మోడళ్లకు నిద్ర లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఆ మూడు కార్ల విశేషాలు తెలుసుకుందాం.

1. కొత్త అవతారంలో హ్యుందాయ్ వెర్నా : వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి హ్యుందాయ్ తన పాపులర్ సెడాన్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే దక్షిణ కొరియాతో పాటు ఇండియాలో కూడా దీని టెస్టింగ్ జరుగుతోంది. పాత మోడల్ కంటే ఇది మరింత షార్ప్ లుక్‌తో ఉండబోతోంది. కొత్త రేడియేటర్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, వెనుక వైపు రీడిజైన్ చేసిన బంపర్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. కారు లోపల కళ్లు చెదిరేలా ccNC సాఫ్ట్‌వేర్ కలిగిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి. ఇంజిన్ పవర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

2. టాటా పంచ్‌కు పోటీగా ఎక్స్‌టర్ అప్‌డేట్ : ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా కొత్త అప్‌డేట్ పొందబోతోంది. వెర్నా లాంచ్ అయిన రెండు మూడు నెలలకే ఈ మిడ్-సైకిల్ అప్‌డేట్ రానుంది. ఇందులో కొత్త బంపర్లు, 15 ఇంచుల అల్లాయ్ వీల్స్ , కొత్త ఎల్‌ఈడీ లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కంఫర్ట్ కోసం మరిన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించబోతున్నారు. 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభించే ఈ కారు, ధర పరంగా కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉండనుంది.

3. హ్యుందాయ్ బేయన్ : వచ్చే ఏడాది పండగ సీజన్ అంటే సెప్టెంబర్ 2026లో హుండీ తన సరికొత్త కూపే స్టైల్ ఎస్‌యూవీ బేయన్ ను ఇండియాలో పరిచయం చేయనుంది. ఇది వెన్యూ కంటే కొంచెం ప్రీమియంగా ఉంటుంది. ఇండియాలోనే తయారయ్యే 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో వాడబోతున్నారు. ఈ కారు ధర సుమారు రూ.8.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కూపే డిజైన్ ఇష్టపడే యువతకు ఇది డ్రీమ్ కార్ అవుతుందనడంలో సందేహం లేదు.

హుండీ తన మార్కెట్ షేర్‌ను పెంచుకోవడానికి పకడ్బందీ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా 5 లక్షల నుంచి 12 లక్షల మధ్య ఉండే ఈ రేంజ్, అత్యధికంగా కార్లు అమ్ముడయ్యే విభాగం. మరి హ్యుందాయ్ వేస్తున్న ఈ ఎత్తుగడలకు టాటా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags

Next Story