Hyundai HE1i : 350 కిలోమీటర్ల రేంజ్..అదిరిపోయే ADAS ఫీచర్లు..హ్యుందాయ్ నుంచి కొత్త ఈవీ.

Hyundai HE1i : టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ మోటార్స్ ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్‌తో వస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో పాపులర్ అయిన ఇన్స్టర్ ఈవీని ఆధారంగా చేసుకుని, ప్రత్యేకంగా భారతీయుల కోసం ఒక మేడ్-ఇన్-ఇండియా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి. హ్యుందాయ్ తన కొత్త ఇన్వెస్టర్ డే 2025లో ప్రకటించిన దాని ప్రకారం.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 2027 నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీనికి కంపెనీ HE1i అనే కోడ్ నేమ్ ఇచ్చింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఇది తయారవుతుంది. ముఖ్యంగా ఈ కారులో దేశీయంగా తయారైన ఎక్సైడ్ బ్యాటరీలను వాడబోతున్నారు, దీనివల్ల కారు ధర సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే అవకాశం ఉంది.
స్టాండర్డ్ వెర్షన్: 42kWh బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 300 కి.మీ. రేంజ్ ఇస్తుంది.
లాంగ్ రేంజ్ వెర్షన్: 49kWh బ్యాటరీతో వస్తుంది, ఇది ఏకంగా 355 కి.మీ. నుంచి 370 కి.మీ. వరకు దూసుకెళ్తుంది. నగరాల్లో తిరిగే వారికి స్టాండర్డ్ వెర్షన్, హైవేల మీద వెళ్లే వారికి లాంగ్ రేంజ్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
హుండీ కారంటేనే ఫీచర్లు గుర్తొస్తాయి. ఈ చిన్న EVలో కూడా లగ్జరీ కార్లకు తక్కువ కాకుండా ఫీచర్లు ఇస్తున్నారు. రెండు 10.25 అంగుళాల స్క్రీన్స్ (ఇన్ఫోటైన్‌మెంట్, క్లస్టర్), Level 2 ADAS టెక్నాలజీ (ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ వంటివి), 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. వెహికల్-టు-లోడ్ (V2L) సదుపాయం కూడా ఉంది. అంటే ఈ కారు బ్యాటరీతో మీరు ల్యాప్‌టాప్స్ లేదా చిన్నపాటి ఎలక్ట్రిక్ వస్తువులను కూడా వాడుకోవచ్చు.
ప్రధానంగా ఇది టాటా పంచ్ ఈవీకి ప్రత్యర్థిగా వస్తోంది. దీంతో పాటు సిట్రోయెన్ eC3, రాబోయే మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయల ప్రారంభ ధరతో ఇది వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
