Hyundai Venue : హ్యుందాయ్ సునామీ.. లక్షకు చేరువలో బుకింగ్స్.. ఈ కారు క్రేజ్ మామూలుగా లేదుగా.

Hyundai Venue : హ్యుందాయ్ సునామీ.. లక్షకు చేరువలో బుకింగ్స్.. ఈ కారు క్రేజ్ మామూలుగా లేదుగా.
X

Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. నవంబర్ 2025 నుంచి ఇప్పటివరకు అంటే కేవలం కొద్ది కాలంలోనే ఈ కారు ఏకంగా 80,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం కాంపాక్ట్ సెగ్మెంట్‌లోనే కాకుండా, దేశంలోని మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ కేటగిరీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా వెన్యూ నిలిచింది. డిజైన్ నుంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ వరకు హ్యుందాయ్ చేసిన మార్పులే దీనికి ప్రధాన కారణం.

హ్యుందాయ్ వెన్యూను సిటీ రోడ్లపై నడపడం చాలా సులభం. దీని కాంపాక్ట్ సైజు ట్రాఫిక్‌లో ఈజీగా దూసుకెళ్లడానికి సహాయపడుతుంది. కొత్త వెన్యూలో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉండటంతో ఇది చూడ్డానికి చాలా స్టైలిష్‌గా, బాక్సీ లుక్‌లో కనిపిస్తుంది. లోపల స్పేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా వెనుక సీట్లు రిక్లైనింగ్ ఆప్షన్‌తో రావడం వల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది.

ఈ కారు ఇంటీరియర్ చూస్తే ఏదో లగ్జరీ కారులో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్యూయల్ 12.3-అంగుళాల ఫుల్లీ డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ సీట్లు, మ్యూజిక్ ప్రియుల కోసం 8 స్పీకర్ల ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఆహ్లాదకరమైన ప్రయాణం కోసం సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వెన్యూను తన సెగ్మెంట్‌లోనే మోస్ట్ ఫీచర్-రిచ్ కారుగా నిలబెట్టాయి.

కస్టమర్ల సేఫ్టీ కోసం హ్యుందాయ్ ఇందులో లేటెస్ట్ టెక్నాలజీని వాడింది. కొత్త వెన్యూలో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సూట్‌ను ఇచ్చారు. దీనివల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. అలాగే బ్లూ లింక్ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా మీరు కారును రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా మార్చే ఫీచర్లు ఉండటంతో ఫ్యామిలీస్ కూడా ఈ కారుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రతి ఒక్కరి అవసరానికి తగ్గట్టుగా వెన్యూలో రకరకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్ అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, హ్యుందాయ్ ఇచ్చే నమ్మకమైన సర్వీస్ వెన్యూ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Tags

Next Story