Hyundai Verna : హోండా సిటీకి గుండెల్లో రైళ్లు.. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్!

Hyundai Verna : హోండా సిటీ వంటి సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి హ్యుందాయ్ తమ పాపులర్ మోడల్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. 2006లో మొదటిసారి లాంచ్ అయిన వెర్నా, ప్రస్తుతం నాల్గవ తరం మోడల్‌లో ఉంది. ఈ మిడ్-సైజ్ సెడాన్‌కు సంబంధించిన కొత్త మిడ్‌లైఫ్ అప్‌డేట్ 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ అప్‌డేటెడ్ వెర్నాకు సంబంధించిన టెస్టింగ్ మొదలు కాగా, తాజాగా టెస్ట్ మ్యూల్‌ను గుర్తించారు. ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు బయటపడ్డాయి.
కొత్త 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా ముందు, వెనుక భాగాలలో ముఖ్యమైన మార్పులు ఉంటాయని అంచనా. కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, సరికొత్త లైటింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది. అయితే, కారు సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, బూట్-లిడ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి డిజైన్ అంశాలు ప్రస్తుత మోడల్ నుంచే తీసుకోబడతాయి.
టెస్టింగ్ సమయంలో ఈ కారులో కనిపించిన అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ డ్యుయల్-స్క్రీన్ సెటప్. ఈ కారులో క్రెటా, ఇటీవల లాంచ్ అయిన వెన్యూ మోడళ్లలో మాదిరిగానే కర్వ్డ్ డ్యుయల్-స్క్రీన్ సెటప్‌ను గుర్తించారు. ప్రతి డిస్‌ప్లే యూనిట్ దాదాపు 10.25-అంగుళాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంట్ ఫంక్షనాలిటీ కోసం ఉపయోగపడుతుంది.
కొత్త తరం వెన్యూ మోడల్ నుంచి తీసుకున్న కొత్త D-కట్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉంటుంది. ఈ స్టీరింగ్ యూనిట్‌లో మౌంటెడ్ కంట్రోల్స్‌తో పాటు టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం కూడా ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను అందించేందుకు సిద్ధమవుతోంది.
కొత్త వెర్నా లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్‌తో రానుంది. ఇందులో లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉంటాయి. కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజన్ ఆప్షన్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంచనా. ప్రస్తుతమున్న 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ (115PS పవర్), పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (160PS పవర్) నే కొనసాగించే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, iVT, 7-స్పీడ్ DCT వంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

