ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రభావం.. పెరిగిన బంగారం ధరలు

బంగారం మార్కెట్ గత శుక్రవారం ఏడు నెలల కనిష్ట స్థాయి నుంచి ఔన్సుకు 1,832.26 డాలర్ల వద్ద పుంజుకుంది. ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య వివాదం కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి.
దేశీయ మార్కెట్‌లో, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 220 పెరిగి రూ. 58,200కి చేరుకోగా, ఎంసీఎక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ సోమవారం రూ.494 పెరిగి 10 గ్రాములకు రూ.57,365కి చేరుకుంది.
యుద్ధం ప్రభావం బంగారం పై పడి పెరుగుదలకు కారణమయ్యింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో మధ్య-ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ ప్రమేయం ప్రాంతీయ వివాదం యొక్క ఆందోళనలను మరింత పెంచుతుంది.
రానున్న రోజుల్లో బంగారం 1,880 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని గోల్డ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు సురక్షితమని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com